Telugu Global
Cinema & Entertainment

తమిళ మీడియాను పరుగులుపెట్టిస్తున్నాడు.

మొన్నటివరకు తెలుగు మీడియాను పరుగులుపెట్టించాడు మహేష్. తన కొత్త సినిమా శ్రీమంతుడు ప్రమోషన్ కోసం తనే స్వయంగా రంగంలోకి దిగడంతో మీడియా అంతా మహేష్ వెంట పరుగెత్తింది. అడిగినోళ్లకు అడిగినంత ఇంటర్వ్యూలు ఇచ్చాడు మహేష్. ప్రింట్, ఎలక్ట్రానిక్, వెబ్ అనే తేడాలేకుండా అందరికీ దండిగా ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఇప్పుడు తన ఫోకస్ ను చెన్నైపై పెట్టాడు ప్రిన్స్. తమిళ మీడియాను పరుగులుపెట్టిస్తున్నాడు. తమిళనాట కూడా మహేష్ కు మంచి ఫాలోయింగ్ ఉండడంతో.. ప్రిన్స్ ఇంటర్వ్యూలు తీసుకునేందుకు తమిళ […]

తమిళ మీడియాను పరుగులుపెట్టిస్తున్నాడు.
X
మొన్నటివరకు తెలుగు మీడియాను పరుగులుపెట్టించాడు మహేష్. తన కొత్త సినిమా శ్రీమంతుడు ప్రమోషన్ కోసం తనే స్వయంగా రంగంలోకి దిగడంతో మీడియా అంతా మహేష్ వెంట పరుగెత్తింది. అడిగినోళ్లకు అడిగినంత ఇంటర్వ్యూలు ఇచ్చాడు మహేష్. ప్రింట్, ఎలక్ట్రానిక్, వెబ్ అనే తేడాలేకుండా అందరికీ దండిగా ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఇప్పుడు తన ఫోకస్ ను చెన్నైపై పెట్టాడు ప్రిన్స్. తమిళ మీడియాను పరుగులుపెట్టిస్తున్నాడు. తమిళనాట కూడా మహేష్ కు మంచి ఫాలోయింగ్ ఉండడంతో.. ప్రిన్స్ ఇంటర్వ్యూలు తీసుకునేందుకు తమిళ మీడియా కూడా ఎగబడుతోంది. శ్రీమంతుడు సినిమా ఒకేసారి తెలుగు-తమిళ భాషల్లో విడుదలవుతోంది. తమిళ్ లో ఈ సినిమాను సెల్వంధన్ పేరుతో విడుదల చేస్తున్నారు. సెల్వంధన్ తో తన మార్కెట్ ను విస్తరించుకునేందుకు కోలీవుడ్ పై ఫోకస్ పెట్టిన మహేష్, ప్రత్యేకంగా తమిళనాట ప్రమోషన్ షురూ చేశాడు. మొన్నటివరకు తెలుగులో పబ్లిసిటీ ఇచ్చిన మహేష్, ఇప్పుడు తమిళనాట అందరికీ ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. లైవ్ షోల్లో పాల్గొంటున్నాడు.
First Published:  4 Aug 2015 7:01 PM GMT
Next Story