Telugu Global
Cinema & Entertainment

అఖిల్ సినిమాకి తాత సినిమా పేరు ఫిక్స్... 

వీవీ వినాయక్ దర్శకత్వంలో తెరంగేట్రం చేస్తున్నాడు అఖిల్. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తికావస్తోంది. కానీ సినిమాకు ఇప్పటివరకు పేరుపెట్టలేదు. ఎన్నో టైటిల్స్ అనుకున్నప్పటికీ ఏదీ సూట్ కాలేదని తెలుస్తోంది. ఫైనల్ గా మిస్సైల్, తాండవం అనే రెండు పేర్లను నాగార్జున ఆమోదం కోసం పంపించారు. అయితే వాటిని కూడా నాగార్జున తిరస్కరించినట్టు తెలుస్తోంది. మాస్ టైటిల్ పెట్టి సినిమాపై అంచనాలు పెంచొద్దని, సినిమా కథకు తగ్గట్టు కూల్ టైటిల్ పెట్టమని సూచించాడట. దీంతో యూనిట్ అంతా […]

అఖిల్ సినిమాకి తాత సినిమా పేరు ఫిక్స్... 
X

వీవీ వినాయక్ దర్శకత్వంలో తెరంగేట్రం చేస్తున్నాడు అఖిల్. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తికావస్తోంది. కానీ సినిమాకు ఇప్పటివరకు పేరుపెట్టలేదు. ఎన్నో టైటిల్స్ అనుకున్నప్పటికీ ఏదీ సూట్ కాలేదని తెలుస్తోంది. ఫైనల్ గా మిస్సైల్, తాండవం అనే రెండు పేర్లను నాగార్జున ఆమోదం కోసం పంపించారు. అయితే వాటిని కూడా నాగార్జున తిరస్కరించినట్టు తెలుస్తోంది. మాస్ టైటిల్ పెట్టి సినిమాపై అంచనాలు పెంచొద్దని, సినిమా కథకు తగ్గట్టు కూల్ టైటిల్ పెట్టమని సూచించాడట. దీంతో యూనిట్ అంతా ఆలోచించి బాలరాజు అనే టైటిల్ పెట్టాలని నిర్ణయించారట. గతంలో ఏఎన్నార్ తన కెరీర్ స్టార్టింగ్ లో ఇదే టైటిల్ తో ఓ సినిమా నటించారు. సెంటిమెంట్ కొద్దీ ఇదే టైటిల్ ను అఖిల్ సినిమాకు కూడా పెడితే బాగుంటుందని చాలామంది సూచించారట. మరి అఖిల్ డెబ్యూ మూవీకి ఏ టైటిల్ పెడతారనేది ఆగస్ట్ 29న తేలిపోతుంది. ఎందుకంటే.. నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఆరోజు అఖిల్ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో అఖిల్ సరసన సయేషా సైగల్ హీరోయిన్ గా నటిస్తోంది. నాగ్-నితిన్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

First Published:  4 Aug 2015 7:02 PM GMT
Next Story