Telugu Global
NEWS

ఎర్ర‌బెల్లిపై ఎస్సీ, ఎస్టీ కేసు

వ‌రంగ‌ల్ జిల్లా పాల‌కుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావుపై వరంగల్‌లోని మిల్స్‌కాలనీ పోలీసుస్టేషన్‌లో సోమవారం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతోపాటు హత్యాయత్నం కేసు నమోదైంది. ఆదివారం వరంగల్‌లోని రాంలక్ష్మణ్ గార్డెన్‌లో టీడీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. సమావేశానికి  ఉమ్మడి వికలాంగుల సంస్థ డైరెక్టర్ కంప వినోద్‌కుమార్ హాజరయ్యారు. సమావేశంలో ప్రొటోకాల్‌పై తాను ఎర్ర‌బెల్లిని ప్రశ్నించగా దాడిపై దిగార‌ని వినోద్‌కుమార్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. విక‌లాంగుడినైన త‌న‌ను హేళ‌న చేస్తూ, కులంపేరుతో దూషించి దాడి చేయించార‌ని..ఎర్ర‌బెల్లిపై […]

ఎర్ర‌బెల్లిపై ఎస్సీ, ఎస్టీ కేసు
X
వ‌రంగ‌ల్ జిల్లా పాల‌కుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావుపై వరంగల్‌లోని మిల్స్‌కాలనీ పోలీసుస్టేషన్‌లో సోమవారం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతోపాటు హత్యాయత్నం కేసు నమోదైంది. ఆదివారం వరంగల్‌లోని రాంలక్ష్మణ్ గార్డెన్‌లో టీడీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. సమావేశానికి ఉమ్మడి వికలాంగుల సంస్థ డైరెక్టర్ కంప వినోద్‌కుమార్ హాజరయ్యారు. సమావేశంలో ప్రొటోకాల్‌పై తాను ఎర్ర‌బెల్లిని ప్రశ్నించగా దాడిపై దిగార‌ని వినోద్‌కుమార్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. విక‌లాంగుడినైన త‌న‌ను హేళ‌న చేస్తూ, కులంపేరుతో దూషించి దాడి చేయించార‌ని..ఎర్ర‌బెల్లిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పోలీసుల‌ను కోరాడు. ఫిర్యాదుపై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నామ‌ని పోలీసులు చెప్పారు.
First Published:  4 Aug 2015 3:48 AM GMT
Next Story