Telugu Global
Others

హోదాపై కేంద్రం కసరత్తు: కేంద్రం ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో కేంద్రం, ఆర్థిక శాఖ కసరత్తు చేస్తున్నాయని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. ఈ అంశంపై మంగళవారం లోక్‌సభలో జరిగిన చర్చకు సమాధానమిస్తూ ఏపీకి న్యాయం చేస్తామని ఆయన అన్నారు.  ఏపీకి ఇచ్చిన హామీలపై కేంద్రం సీరియస్‌గా పరిశీలిస్తుందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయడు తెలిపారు. ప్రత్యేక హోదాపై కేంద్రం, ఆర్థికశాఖ కసరత్తు చేస్తున్నాయని ఆయన చెప్పారు. ప్రత్యేక హోదాను గత యూపీఏ ప్రభుత్వం చట్టంలో పొందు పరచలేనందువల్లే ఈ సమస్య వస్తుందని ఆయనన్నారు. అలాగే హైకోర్టును ఖచ్చితంగా […]

హోదాపై కేంద్రం కసరత్తు: కేంద్రం ప్రకటన
X
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో కేంద్రం, ఆర్థిక శాఖ కసరత్తు చేస్తున్నాయని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. ఈ అంశంపై మంగళవారం లోక్‌సభలో జరిగిన చర్చకు సమాధానమిస్తూ ఏపీకి న్యాయం చేస్తామని ఆయన అన్నారు. ఏపీకి ఇచ్చిన హామీలపై కేంద్రం సీరియస్‌గా పరిశీలిస్తుందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయడు తెలిపారు. ప్రత్యేక హోదాపై కేంద్రం, ఆర్థికశాఖ కసరత్తు చేస్తున్నాయని ఆయన చెప్పారు. ప్రత్యేక హోదాను గత యూపీఏ ప్రభుత్వం చట్టంలో పొందు పరచలేనందువల్లే ఈ సమస్య వస్తుందని ఆయనన్నారు. అలాగే హైకోర్టును ఖచ్చితంగా విభజిస్తామని వెంకయ్యనాయుడు తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదాపై హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ప్రకటన చేస్తూ విభజన వల్ల నష్టపోయిన రాష్ట్రాన్ని ఆదుకోవడానికి తాము ప్రయత్నిస్తున్నామని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలోను, తెలంగాణకు హైకోర్టు విషయంలోను తాము న్యాయం చేస్తామని చెప్పారు. హోదాపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైఎస్‌ఆర్‌సీ సభ్యుల ఆందోళనకు జవాబుగా హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ లోక్‌సభలో ప్రకటించారు. ప్రత్యేక హోదాపై స్పష్టమైన ప్రకటన చేయాల్సిన అవసరం ఉందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ సభ్యులు డిమాండు చేశారు.
అంతకుముందు ప్రత్యేక హోదా చర్చలో పాల్గొంటూ… ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక సంక్షోభంలో ఉందని, ప్రత్యేక హోదా ఇచ్చి రాష్ట్రాన్ని ఆదుకోవలసిన అవసరం ఉందని లోక్‌సభలో టీడీపీ, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ సభ్యులు కేంద్రాన్ని డిమాండు చేశారు. ప్రత్యేక హోదా కోసం ఏపీలో ఇపుడు ఆందోళనలు జరుగుతున్నాయని, తప్పనిసరి పరిస్థితుల్లోనే తాము సభలో ఆందోళనలు చేస్తున్నామని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన కోరుతున్నామని ఆయన డిమాండు చేశారు. టీడీపీ సభ్యుడు అవంతి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రత్యేక హోదా 15 యేళ్ళు ఇస్తామని బీజేపీ గతంలో హామీ ఇచ్చిందని ఇపుడు దాన్ని మరిచిపోయినట్టు వ్యవహరిస్తోందని అన్నారు. విభజన తర్వాత ప్రముఖ సంస్థలన్నీ హైదరాబాద్‌లోనే ఉండిపోయాయని, రాష్ట్రానికి తగిన ఆదాయ వనరులు లేకుండా పోయాయని అవంతి చెప్పారు. రాష్ట్రం మొత్తం వెనుకబడి ఉన్నా… బాగా వెనుకబడి ఉన్న రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీలు ఇచ్చి ఆదుకోవాలని ఆయన అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని యూపీఏ ప్రభుత్వం హామీ ఇచ్చింది. మన్మోహన్‌ సింగ్‌ ప్రధాని హోదాలో సభలో హామీ ఇచ్చారని, కాంగ్రెస్‌ వల్లే ఏపీకి ఈ దుస్థితి దాపురించిందని ఆయన అన్నారు. యేడాదిన్నర తర్వాత ప్రత్యేక హోదా విషయం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు గుర్తుకు వచ్చిందని, ఇప్పటికైనా ఏపీ పట్ల వారికున్న బాధ్యతను గుర్తించినందుకు సంతోషంగా ఉందని అవంతి శ్రీనివాస్‌ అన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు రావాలంటే ప్రత్యేక హోదాతోనే సాధ్యమని ఆయన చెప్పారు.

First Published:  4 Aug 2015 12:57 AM GMT
Next Story