Telugu Global
NEWS

ర్యాగింగే రిషితేశ్వ‌రి ప్రాణం తీసింది

 గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఇంజినీరింగ్ విద్యార్థి మృతికి ర్యాగింగే కార‌ణ‌మ‌ని తేలిన‌ట్లు స‌మాచారం. రిషితేశ్వ‌రి మృతిపై ప్ర‌భుత్వం రిటైర్డ్  ఐఏఎస్ బాల సు‌బ్ర‌మ‌ణ్యం నేతృత్వంలో నియ‌మించిన విచార‌ణ క‌మిటీ ఈ మేర‌కు నివేదిక ఇచ్చిన‌ట్లు తెలిసింది. ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ జ‌రిపిన క‌మిటీ సీనియ‌ర్ల వేధింపుల వ‌ల్లే రిషితేశ్వ‌రి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింద‌ని నిర్ధార‌ణ‌కు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. ఈ మేర‌కు  బాల సు‌బ్ర‌మ‌ణ్యం సోమ‌వారం స‌చివాల‌యంలో సీఎస్‌నుక‌లిసి ఇందుకు సంబంధించిన ప్రాథ‌మిక విష‌యాల్ని వివ‌రించిన‌ట్లు […]

ర్యాగింగే రిషితేశ్వ‌రి ప్రాణం తీసింది
X
గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఇంజినీరింగ్ విద్యార్థి మృతికి ర్యాగింగే కార‌ణ‌మ‌ని తేలిన‌ట్లు స‌మాచారం. రిషితేశ్వ‌రి మృతిపై ప్ర‌భుత్వం రిటైర్డ్ ఐఏఎస్ బాల సు‌బ్ర‌మ‌ణ్యం నేతృత్వంలో నియ‌మించిన విచార‌ణ క‌మిటీ ఈ మేర‌కు నివేదిక ఇచ్చిన‌ట్లు తెలిసింది. ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ జ‌రిపిన క‌మిటీ సీనియ‌ర్ల వేధింపుల వ‌ల్లే రిషితేశ్వ‌రి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింద‌ని నిర్ధార‌ణ‌కు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. ఈ మేర‌కు బాల సు‌బ్ర‌మ‌ణ్యం సోమ‌వారం స‌చివాల‌యంలో సీఎస్‌నుక‌లిసి ఇందుకు సంబంధించిన ప్రాథ‌మిక విష‌యాల్ని వివ‌రించిన‌ట్లు తెలిసింది. దీనిపై త్వ‌ర‌లోనే పూర్తిస్థాయి నివేదిక బాల సు‌బ్ర‌మ‌ణ్యం క‌మిటీ ప్ర‌భుత్వానికి స‌మ‌ర్పించ‌నుంది.
First Published:  3 Aug 2015 9:10 PM GMT
Next Story