పుట్టినరోజు నాడు రిలీజ్.. ?
అభిమానుల కోసం అదిరిపోయే బర్త్ డే గిఫ్ట్ రెడీ చేశాడు చిరంజీవి. ఈనెల 22న మెగాస్టార్ పుట్టినరోజు. ఈ సందర్భంగా మెగాఫ్యాన్స్ కోసం ఓ కలర్ ఫుల్ ఫొటోషూట్ రెడీచేశారు. ప్రముఖ బాలీవుడ్ స్టిల్ ఫొటోగ్రాఫర్ నేతృత్వంలో ఈమధ్యే ఈ ఫొటోషూట్ ను తెరకెక్కించారు. పుట్టినరోజు సందర్భంగా ఈ ఫొటోల్ని విడుదల చేయబోతున్నారు. చిరంజీవి సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తారనే ప్రచారం ఎప్పట్నుంచో జరుగుతోంది. 150వ సినిమా చేస్తానని అటు చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్ కూడా […]
BY admin3 Aug 2015 7:02 PM GMT
X
admin Updated On: 4 Aug 2015 1:39 AM GMT
అభిమానుల కోసం అదిరిపోయే బర్త్ డే గిఫ్ట్ రెడీ చేశాడు చిరంజీవి. ఈనెల 22న మెగాస్టార్ పుట్టినరోజు. ఈ సందర్భంగా మెగాఫ్యాన్స్ కోసం ఓ కలర్ ఫుల్ ఫొటోషూట్ రెడీచేశారు. ప్రముఖ బాలీవుడ్ స్టిల్ ఫొటోగ్రాఫర్ నేతృత్వంలో ఈమధ్యే ఈ ఫొటోషూట్ ను తెరకెక్కించారు. పుట్టినరోజు సందర్భంగా ఈ ఫొటోల్ని విడుదల చేయబోతున్నారు. చిరంజీవి సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తారనే ప్రచారం ఎప్పట్నుంచో జరుగుతోంది. 150వ సినిమా చేస్తానని అటు చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్ కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో పుట్టినరోజు కానుకగా విడుదలకాబోతున్న ఫొటోస్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తన షష్టిపూర్తి వేడుక సందర్భంగా చిరంజీవి తన 150వ సినిమా సంగతుల్ని కూడా వెల్లడించే అవకాశముందని అంతా అంచనావేస్తున్నారు. మరోవైపు ఫ్యాన్స్ మాత్రం చిరు పుట్టినరోజు వేడుకలను ఈసారి గ్రాండ్ గా నిర్వహించాలని నిర్ణయించారు. ఒకరోజు కాకుండా.. ఏకంగా 3 రోజుల పాటు చిరు జన్మదిన మహోత్సవాన్ని నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. ఈ మేరకు బ్లడ్ బ్యాంక్ లు, అన్నదానాలు లాంటి సామాజిక కార్యక్రమాలతో షెడ్యూల్ కూడా రెడీ చేసుకున్నారు. వీటితో పాటు మరిన్ని ఆశ్చర్యకర అంశాల్ని పుట్టినరోజు సందర్భంగా ప్రకటించే అవకాశముంది.
Next Story