Telugu Global
Cinema & Entertainment

మహేష్ శ్రీమంతుడు ఎవరి కోసం ?

భూమి సూర్యుని చుట్టు తిరిగిన‌ట్లు..  స‌క్సెస్ చుట్టు ఇండ‌స్ట్రీ తిరిగుతుంది. అయితే ఈ స‌క్సెస్  దేవ‌త  స్టార్ హీరోల ప‌ట్ల  ఒక విధంగా .. స్టార్స్ కాని వారి ప‌ట్ల  మ‌రో విధంగా ఉంటుంది .  స్టార్ డ‌మ్ గెయిన్ చేసిన హీరోల‌కు   కొన్ని ఫెయిల్యూర్స్ పడ్డా  ఫ్యాన్స్  త‌ట్టుకుంటారు.  ఒక మంచి హిట్ ప‌డితే  గత‌  ఫెయిల్యూర్స్ మొత్తం తుడిచేసి..ఆ స‌క్సెస్  తో  సంబ‌ర ప‌డ‌తారు.  ప‌వ‌న్ క‌ళ్యాణ్  , మ‌హేష్ బాబు ల […]

మహేష్ శ్రీమంతుడు ఎవరి కోసం ?
X
భూమి సూర్యుని చుట్టు తిరిగిన‌ట్లు.. స‌క్సెస్ చుట్టు ఇండ‌స్ట్రీ తిరిగుతుంది. అయితే ఈ స‌క్సెస్ దేవ‌త స్టార్ హీరోల ప‌ట్ల ఒక విధంగా .. స్టార్స్ కాని వారి ప‌ట్ల మ‌రో విధంగా ఉంటుంది . స్టార్ డ‌మ్ గెయిన్ చేసిన హీరోల‌కు కొన్ని ఫెయిల్యూర్స్ పడ్డా ఫ్యాన్స్ త‌ట్టుకుంటారు. ఒక మంచి హిట్ ప‌డితే గత‌ ఫెయిల్యూర్స్ మొత్తం తుడిచేసి..ఆ స‌క్సెస్ తో సంబ‌ర ప‌డ‌తారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ , మ‌హేష్ బాబు ల విష‌యంలో అభిమానులు మ‌రింత అక్కున చేర్చుకుంటారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ విష‌యంలో అస‌లు వ‌ర‌స‌గా ఫెయిల్యూర్స్ వున్నా ఫ్యాన్స్ ప‌ట్టించుకోరు .మ‌హేష్ బాబు విష‌యంలోను ఇంచు మించుగా అదే ఫాలో అవుతున్న‌ట్లు అనిపిస్తుంది. గ‌త యేడాది ప్రిన్స్ న‌టించిన రెండు చిత్రాలు బాక్సాపీస్ ద‌గ్గ‌ర బోల్తా ప‌డ్డాయి.
అయితేనేమి ప్ర‌స్తుతం విడుద‌ల‌కు సిద్ద‌మైన శ్రీ‌మంతుడు సినిమా కోసం ఆత్రుతుగా వెయిట్ చేస్తున్నారు . ఆన్ లైన్ బుకింగ్ ఓపెన్ చేయ‌గానే అన్ని థియేట‌ర్స లో టికెట్స్ వీకెండ్ కు అడ్వాన్స్ బుక్ అయిపోయాయి. ఇది మ‌హేష్ బాబు పై ఫ్యాన్స్ కు వున్న ఫాలోయింగ్ కు ఎగ్జాంపుల్ అనే చెప్పాలి. డైరెక్ట‌ర్ కొరాటాల శివ‌,.. మ‌హేష్ బాహు ,శృతిహాస‌న్, లీడ్ రోల్స్ లో శ్రీ‌మంతుడు చిత్రం చేశారు. ప్ర‌చార చిత్రాలు..ఆడియో సూప‌ర్ హైప్ ను క్రియేట్ చేశాయి. మ‌రి మిర్చి చిత్రాంలా శ్రీ‌మంతుడు సినిమాను బ్లాక్ బ‌స్ట‌ర్ రేంజ్ హిట్ గా వండి వార్చాడో…లేక ఒక స‌గ‌టు చిత్రం గా తీర్చి దిద్దాడో తెలియాలంటే కొన్ని గంట‌లు ఆగితే చాలు మ‌రి.
First Published:  4 Aug 2015 12:02 AM GMT
Next Story