Telugu Global
CRIME

ఫార్మసీ విద్యార్థినిపై ప్రేమోన్మాది హత్యాయత్నం!

వరంగల్‌ కేర్‌ ఫార్మసీ కాలేజీలో ఓ ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. తనపై దురుసుగా ప్రవర్తించిందన్న కారణంతో తోటి విద్యార్థిని హత్య చేసే ప్రయత్నం చేశారు. ఈ కాలేజీలో చదువుతున్న వంశీ గత కొంతకాలంగా వేదశ్రీ అనే ఫార్మసీ విద్యార్థినిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. తన ప్రేమను నిర్లక్ష్యం చేస్తుందని, పైగా తిట్టందనే కారణంతో వేదశ్రీని సోమవారం కాలేజీలో ఉండగానే గొంతు నులిమి చంపే ప్రయత్నం చేశాడు. తోటి విద్యార్థులంతా అడ్డుకుని వేదశ్రీని రక్షించి వరంగల్‌లోని ఎంజీఎంకు బాధితురాలిని […]

ఫార్మసీ విద్యార్థినిపై ప్రేమోన్మాది హత్యాయత్నం!
X
వరంగల్‌ కేర్‌ ఫార్మసీ కాలేజీలో ఓ ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. తనపై దురుసుగా ప్రవర్తించిందన్న కారణంతో తోటి విద్యార్థిని హత్య చేసే ప్రయత్నం చేశారు. ఈ కాలేజీలో చదువుతున్న వంశీ గత కొంతకాలంగా వేదశ్రీ అనే ఫార్మసీ విద్యార్థినిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. తన ప్రేమను నిర్లక్ష్యం చేస్తుందని, పైగా తిట్టందనే కారణంతో వేదశ్రీని సోమవారం కాలేజీలో ఉండగానే గొంతు నులిమి చంపే ప్రయత్నం చేశాడు. తోటి విద్యార్థులంతా అడ్డుకుని వేదశ్రీని రక్షించి వరంగల్‌లోని ఎంజీఎంకు బాధితురాలిని తరలించారు. నిందితుడిపై నిర్భయ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై మహిళా సంఘాలు మండిపడ్డాయి. ప్రేమోన్మాదికి కఠిన శిక్ష వేయాలని మహిళ సంఘం నేతలు డిమాండ్ చేశారు. మహిళల రక్షణకు ఎన్ని చట్టాలు చేస్తున్నా ఇలాంటి ఘటనలు జరగడం దారుణమని వారు అన్నారు.
First Published:  3 Aug 2015 3:33 AM GMT
Next Story