Telugu Global
Cinema & Entertainment

దానవీరశూర కర్ణ రెడీ

అప్పట్లో దానవీరశూరకర్ణ ఎంత విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే పేరుతో, మళ్లీ అదే స్టోరీలైన్ తో సినిమా తెరకెక్కుతోంది. దీన్ని కూడా నందమూరి వంశమే తెరకెక్కిస్తోంది. అయితే అంతా బాలనటులతో. అవును.. రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన నందమూరి జానకిరామ్ కొడుకు మాస్టర్ ఎన్టీఆర్ హీరోగా దానవీరశూరకర్ణ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో మాస్టర్ ఎన్టీఆర్ సోదరుడు సౌమిత్ర, ప్రముఖ నటి జానకి మనవడు కూడా నటిస్తున్నారు. వీళ్లందర్నీ హీరోలుగా పెట్టి జేవీఆర్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. […]

దానవీరశూర కర్ణ రెడీ
X
అప్పట్లో దానవీరశూరకర్ణ ఎంత విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే పేరుతో, మళ్లీ అదే స్టోరీలైన్ తో సినిమా తెరకెక్కుతోంది. దీన్ని కూడా నందమూరి వంశమే తెరకెక్కిస్తోంది. అయితే అంతా బాలనటులతో. అవును.. రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన నందమూరి జానకిరామ్ కొడుకు మాస్టర్ ఎన్టీఆర్ హీరోగా దానవీరశూరకర్ణ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో మాస్టర్ ఎన్టీఆర్ సోదరుడు సౌమిత్ర, ప్రముఖ నటి జానకి మనవడు కూడా నటిస్తున్నారు. వీళ్లందర్నీ హీరోలుగా పెట్టి జేవీఆర్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనిలో ఉంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే స్వతంత్ర దినోత్సవ కానుకగా ఈనెల 15న సినిమాను థియేటర్లలోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. శ్రీ సాయి జగపతి పిక్చర్స్, సంతోష్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై చలసాని వెంకటేశ్వరరావు, జె.బాలరాజు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ తోపాటు బాలకృష్ణ కూడా రంగంలోకి దిగి ఈ సినిమాకు ప్రత్యేకంగా ప్రచారం కల్పించాలనుకుంటున్నారు.
First Published:  2 Aug 2015 7:05 PM GMT
Next Story