Telugu Global
Cinema & Entertainment

బాలీవుడ్ పై బాహుబలి ఎఫెక్ట్

బాలీవుడ్ లో రిలీజ్ డేట్స్ అన్నీ పక్కాగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే షూటింగ్ ప్రారంభమైన తొలిరోజే చాలా సినిమాలకు రిలీజ్ డేట్స్ ఎనౌన్స్ చేస్తారు. అంత ప్రీ-ప్లాన్డ్ గా ఉంటారు కాబట్టే బడా సినిమాలేవీ అక్కడ క్లాష్ కావు. కానీ బాహుబలి సినిమా ఎఫెక్ట్ మాత్రం బాలీవుడ్ చిత్రాలపై బాగానే పడింది. సాధారణంగా డబ్బింగ్ సినిమాల్ని బాలీవుడ్ లైట్ తీసుకుంటుంది. అలాంటి సినిమాల ప్రభావం తమపై పెద్దగా ఉండదని భావిస్తుంది. అందుకే సి-గ్రేడ్ మూవీస్ కూడా డబ్బింగ్ […]

బాలీవుడ్ పై బాహుబలి ఎఫెక్ట్
X
బాలీవుడ్ లో రిలీజ్ డేట్స్ అన్నీ పక్కాగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే షూటింగ్ ప్రారంభమైన తొలిరోజే చాలా సినిమాలకు రిలీజ్ డేట్స్ ఎనౌన్స్ చేస్తారు. అంత ప్రీ-ప్లాన్డ్ గా ఉంటారు కాబట్టే బడా సినిమాలేవీ అక్కడ క్లాష్ కావు. కానీ బాహుబలి సినిమా ఎఫెక్ట్ మాత్రం బాలీవుడ్ చిత్రాలపై బాగానే పడింది. సాధారణంగా డబ్బింగ్ సినిమాల్ని బాలీవుడ్ లైట్ తీసుకుంటుంది. అలాంటి సినిమాల ప్రభావం తమపై పెద్దగా ఉండదని భావిస్తుంది. అందుకే సి-గ్రేడ్ మూవీస్ కూడా డబ్బింగ్ సినిమాల్ని పట్టించుకోవు. కానీ బాహుబలి అలాంటి సినిమా కాదు. ఆ విషయం విడుదలైన తర్వాత బాలీవుడ్ జనాలకు తెలిసొచ్చింది. సల్మాన్ నటించిన బజరంగీ భాయిజాన్ విడుదల తేదీని చూసుకొని తన సినిమా రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసుకున్న బాలీవుడ్ నిర్మాతలు.. బాహుబలి దెబ్బకు మాత్రం తలొగ్గక తప్పలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని సినిమాల్ని పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు. తాజాగా ఈ లిస్ట్ లోకి బంగిస్తాన్ కూడా చేరిపోయింది. రితేష్ దేశ్ ముఖ్, పుల్కిత్ సామ్రాట్ నటించిన ఈ సినిమా కేవలం సల్మాన్, ప్రభాస్ సినిమాల కారణంగానే వాయిదాపడింది. ఆ విషయాన్ని మేకర్స్ ప్రకటించారు కూడా. బాహుబలి, బజరంగీ సినిమాల టైమ్ లో మా చిత్రాన్ని విడుదల చేసి సాహసం చేయదలచుకోలేదంటూ ట్వీట్ చేశాడు ఆ సినిమా నిర్మాత.
Next Story