Telugu Global
Family

నక్క-ద్రాక్షతోట (Devotional)

ఒక తెలివి తక్కువ నక్కదారంటీ వెళుతూవుంటే పక్కనే ద్రాక్షతోట కనిపించింది. ఆ ద్రాక్షతోట చుట్టూ బలమైన కంచె ఉంది. నక్క కంచెలో దూరడానికి రంధ్రం ఉందేమోనని అంతా వెతికింది. ఎక్కడా ఆ నక్క పట్టగలిగేటంత రంధ్రం కనిపించలేదు. ఒక దగ్గరమాత్రం నక్క తలపట్టేంత రంధ్రం మాత్రం కనిపించింది. నక్క అక్కడ ఆగి తలదూర్చింది. తల ద్రాక్షతోటలోపలికి వెళ్ళింది కానీ శరీరం పట్టలేదు. లాభం లేదని తలని వెనక్కి తీసేసింది. కానీ ద్రాక్షగుత్తుల్ని చూసి నక్కనోట్లో నీళ్ళూరాయి. పైగా […]

ఒక తెలివి తక్కువ నక్కదారంటీ వెళుతూవుంటే పక్కనే ద్రాక్షతోట కనిపించింది. ఆ ద్రాక్షతోట చుట్టూ బలమైన కంచె ఉంది. నక్క కంచెలో దూరడానికి రంధ్రం ఉందేమోనని అంతా వెతికింది. ఎక్కడా ఆ నక్క పట్టగలిగేటంత రంధ్రం కనిపించలేదు. ఒక దగ్గరమాత్రం నక్క తలపట్టేంత రంధ్రం మాత్రం కనిపించింది. నక్క అక్కడ ఆగి తలదూర్చింది. తల ద్రాక్షతోటలోపలికి వెళ్ళింది కానీ శరీరం పట్టలేదు. లాభం లేదని తలని వెనక్కి తీసేసింది.

కానీ ద్రాక్షగుత్తుల్ని చూసి నక్కనోట్లో నీళ్ళూరాయి. పైగా గుత్తులు నేలకు తాకుతున్నాయి. ఎట్లాగయినా ద్రాక్షపళ్ళు తిని తీరాలని నక్క సంకల్పించుకుంది. నక్క సన్నబడితే తప్ప కంచెనించీ తోటలోకి వెళ్ళలేదు. ఎందుకంటే కంచెకున్న రంధ్రం అంత చిన్నది.

ద్రాక్ష పళ్ళు తినాలన్న కోరికతో నక్క నిరాహారదీక్ష ప్రారంభించింది. అంటే తిండి తినడం మానేసింది. తిండి తినడం మానేస్తే సాధారణంగా సన్నబడతారు కదా! మూడురోజులయ్యేసరికి నక్క సన్నబడింది. తలను కంచెలో దూర్చి మొత్తానికి శ్రమపడి ద్రాక్షతోటలోకి వెళ్ళింది. తోట నిండుగా ద్రాక్షపళ్ళ గుత్తులు వేలాడుతూ అన్నీ తనకోసమే వున్నట్లు ఊరించాయి.

నక్క ద్రాక్షపళ్ళని కడుపారా తిన్నది. కడుపునిండా తినడం, మత్తుగా నిద్రపోవడం, మూడురోజులపాటు నిరంతరం అదేపని చెయ్యడంలో మునిగిపోయింది. ఫలితంగా లావయింది. దానికాసంగతి తెలీలేదు. ఇక చాలనుకుని బయటికి వెళదామనుకుని కంచెలోని రంధ్రంలో తలపెట్టింది. కాని తలపట్టిందే కానీ శరీరం పట్టలేదు. ఏం చెయ్యాలో తోచలేదు. మూడు రోజులపాటు కళ్ళముందు ద్రాక్షగుత్తులు కవ్విస్తున్నా నిరాహారంగా ఉంది. ఫలితంగా సన్నబడింది. అపుడు రంధ్రంగుండా తోటబయటికి వచ్చింది.

వెళ్ళబోతూ తోటను చూసి “ద్రాక్షతోటా! ద్రాక్షతోటా! నువ్వెంత అందంగా ఉన్నావు, నీ పళ్ళెంత అందంగా ఉన్నాయి. కానీ నీ వల్ల నాకు ఏమి ఒరిగింది? నీ వల్ల నాకు వచ్చిందీ లేదు, పోయిందీ లేదు. నీ దగ్గరికి ఎట్లావచ్చానో, అట్లాగే తిరిగి వెళుతున్నాను” అనుకుంటూ వెళ్ళింది.

అట్లాగే జ్ఞానులు కూడా ఈ ప్రపంచం గురించి చెబుతారు. ఇది అద్భుతమైన ప్రపంచం. కాని ప్రపంచంలో అందరి కన్నా జ్ఞాని అయిన సాలమన్‌ మహారాజు “మనిషి ఖాళీ చేతుల్తో ఈ భూమిలోకి వస్తాడు. ఒట్టిచేతుల్తో తిరిగివెళతాడు” అన్నాడు.

అట్లా మంచిపనుల ఫలితాలు మాత్రమే మనిషి వెంట వస్తాయి.

– సౌభాగ్య

First Published:  30 July 2015 1:01 PM GMT
Next Story