Telugu Global
Cinema & Entertainment

మాస్ సాంగ్ ఆఫర్ కొట్టేసిన తమన్నా...

ఒక్క సాంగ్  త‌మ‌న్నా కెరీర్ గ్రాఫ్ ను  పెంచిసింది అన‌డంలో  సందేహామే లేదు. బాహుబ‌లి చిత్రంలో  త‌మ‌న్నా రోల్ కంప్లీట్ గ్లామ‌ర్ రోల్ అయ్యుంటుందని ఆమె అభిమానులూహించారు.  అయితే  త‌మ‌న్నా’ను అటు గ్లామ‌ర్ తో పాటు.. ఇటు యాక్టింగ్ కు స్కోప్ వుండే రోల్ ను చేయించారు.  త‌న యాక్టింగ్ కు మిక్స్ డ్ రెస్పాన్స్ వ‌చ్చిన‌ప్ప‌టికి..  గ్లామ‌ర్ విష‌యంలో   అభిమానుల్ని ఫిదా చేసింది.   ప్ర‌భాస్ తో  చేసిన ప‌చ్చ బొట్టేసినా సాంగ్   […]

మాస్ సాంగ్ ఆఫర్ కొట్టేసిన తమన్నా...
X
ఒక్క సాంగ్ త‌మ‌న్నా కెరీర్ గ్రాఫ్ ను పెంచిసింది అన‌డంలో సందేహామే లేదు. బాహుబ‌లి చిత్రంలో త‌మ‌న్నా రోల్ కంప్లీట్ గ్లామ‌ర్ రోల్ అయ్యుంటుందని ఆమె అభిమానులూహించారు. అయితే త‌మ‌న్నా’ను అటు గ్లామ‌ర్ తో పాటు.. ఇటు యాక్టింగ్ కు స్కోప్ వుండే రోల్ ను చేయించారు. త‌న యాక్టింగ్ కు మిక్స్ డ్ రెస్పాన్స్ వ‌చ్చిన‌ప్ప‌టికి.. గ్లామ‌ర్ విష‌యంలో అభిమానుల్ని ఫిదా చేసింది.
ప్ర‌భాస్ తో చేసిన ప‌చ్చ బొట్టేసినా సాంగ్ కోసం బాహుబ‌లి సినిమాను రెండు మూడు సార్లు చూస్తున్నారంటే.. అతిశ‌యోక్తి కాదు. ఆ సాంగ్ లో త‌మ‌న్నా బ్యూటీని ద‌ర్శ‌కుడు వెండి తెర పై అద్భుతమైన రీతిలో ఆవిష్క‌రించారు. పాట పిక్చ‌రైజేషన్ సినీ ప్రముఖులను సహితం ఆకట్టుకుంది. మొత్తం మీద త‌మ‌న్నాకు బాహుబ‌లి ఊపిరి పోసిందనే చెప్పాలి. కెరీర్ కు మ‌రింత ఆక్సిజ‌న్ ఇచ్చింది. ఇక అసలు విష‌యం ఏమిటంటే..సుకుమార్, ఎన్టీఆర్ కాంబినేష‌న్ లో వ‌స్తున్న సినిమాలో ఒక స్పెష‌ల్ సాంగ్ ను రెడి చేశార‌ట‌. ఈ సాంగ్ కు స్టార్ డ‌మ్ వున్న హీరోయిన్ అయితే బావుంటుంద‌ని ఫిక్స్ అయ్యార‌ట‌. క‌ట్ చేస్తే త‌మ‌న్నా ను ఈ ఛాన్స్ వ‌రించింద‌ని ఫిల్మ్ న‌గ‌ర్ స‌మాచారం. సుకుమార్ ఎన్టీఆర్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకునే క్లాస్ మాస్.. ఎలిమెంట్స్ వుండేలా చేస్తున్నార‌ట‌. మొత్తం మీద త‌మన్నా ఆఫ‌ర్స్ బాహుబలిలో మ‌రింత బూస్టింగ్ వచ్చినట్టే … కదా ?
First Published:  30 July 2015 12:00 PM GMT
Next Story