Telugu Global
Cinema & Entertainment

పేరుకేమో వీడు నాని.. రెచ్చిపోతే..

హీరో నానిపై ఇప్పటికే ఓ పాట వచ్చింది. నేనే నానీనే.. అంటూ ఈగలో కీరవాణి గమ్మత్తుగా నాని పేరుతో ఓ సాంగ్ కంపోజ్ చేశాడు. అది సూపర్ హిట్టయింది కూడా. ఇప్పుడు నానిపై మరో పాట కూడా తెరకెక్కుతోంది. పేరుకేమో వీడు నాని.. రెచ్చిపోతే ధోనీ.. అనే లిరిక్స్ తో ఈ పాట తెరకెక్కుతోంది. ఇందులో కూడా నానీనే హీరోగా నటిస్తున్నాడు. భలే భలే మగాడివోయ్ సినిమాలో ఈ పాట ఉంది. ప్రస్తుతం ఈ పాట షూటింగ్ శరవేగంగా […]

పేరుకేమో వీడు నాని.. రెచ్చిపోతే..
X
హీరో నానిపై ఇప్పటికే ఓ పాట వచ్చింది. నేనే నానీనే.. అంటూ ఈగలో కీరవాణి గమ్మత్తుగా నాని పేరుతో ఓ సాంగ్ కంపోజ్ చేశాడు. అది సూపర్ హిట్టయింది కూడా. ఇప్పుడు నానిపై మరో పాట కూడా తెరకెక్కుతోంది. పేరుకేమో వీడు నాని.. రెచ్చిపోతే ధోనీ.. అనే లిరిక్స్ తో ఈ పాట తెరకెక్కుతోంది. ఇందులో కూడా నానీనే హీరోగా నటిస్తున్నాడు. భలే భలే మగాడివోయ్ సినిమాలో ఈ పాట ఉంది. ప్రస్తుతం ఈ పాట షూటింగ్ శరవేగంగా నడుస్తోంది. ఈ సాంగ్ షూట్ తో టోటల్ సినిమా కంప్లీట్ అయిపోతుంది. సినిమాలో నాని సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తోంది. గీతాఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తున్నాడు. సినిమాను రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు నాని. గోపీ సుందర్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. పోస్ట్ ప్రొడక్షన్లు పనులు పూర్తయిన వెంటనే.. వారం రోజుల్లో పాటలు విడుదల చేసి.. ఆగస్ట్ 2 లేదా మూడో వారంలో సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని భావిస్తున్నారు. రీసెంట్ గా సరైన కమర్షియల్ హిట్ లేని నాని, భలే భలే మగాడివోయ్ చిత్రంపై భారీ ఆశలు పెట్టుకున్నాడు.
Next Story