Telugu Global
NEWS

ఉన్న‌తాధికారుల‌తో బాబు మ్యూజిక‌ల్ చైర్!

న‌వ్యాంధ్ర ప్ర‌దేశ్ నూత‌న రాజ‌ధాని నిర్మాణ విష‌యంలో ముఖ్య‌మంత్రి వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు కుర్చీలాటలా ఉంద‌నే విమ‌ర్శ‌లు వినప‌డుతున్నాయి. రాజ‌ధాని నిర్మాణ వ్య‌వ‌హారంలో అవ‌గాహ‌న క‌లిగిన ప్ర‌తి ఐఏఎస్‌నూ ముఖ్య‌మంత్రి త‌ప్పిస్తున్నారు. మొద‌ట సీనియ‌ర్ ఐఏఎస్ దొండ‌పాటి సాంబ‌శివ‌రావు సింగ‌పూర్‌తో ప్ర‌భుత్వం చేసుకున్న ఒప్పందంలో కీల‌క సూత్ర‌ధారి. ఆయ‌నను టీటీడీ ఈవోగా బ‌దిలీ చేశారు. ఆ త‌రువాత వ‌చ్చిన ఆర్మానే గిరిధ‌ర్ రాజ‌ధాని భూ స‌మీక‌ర‌ణ ఒప్పందాల వ్య‌వ‌హారాలను చూశారు. ఆ ప్ర‌క్రియ పూర్తి కాగానే ఆయ‌న‌ను కూడా […]

ఉన్న‌తాధికారుల‌తో బాబు మ్యూజిక‌ల్ చైర్!
X
న‌వ్యాంధ్ర ప్ర‌దేశ్ నూత‌న రాజ‌ధాని నిర్మాణ విష‌యంలో ముఖ్య‌మంత్రి వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు కుర్చీలాటలా ఉంద‌నే విమ‌ర్శ‌లు వినప‌డుతున్నాయి. రాజ‌ధాని నిర్మాణ వ్య‌వ‌హారంలో అవ‌గాహ‌న క‌లిగిన ప్ర‌తి ఐఏఎస్‌నూ ముఖ్య‌మంత్రి త‌ప్పిస్తున్నారు. మొద‌ట సీనియ‌ర్ ఐఏఎస్ దొండ‌పాటి సాంబ‌శివ‌రావు సింగ‌పూర్‌తో ప్ర‌భుత్వం చేసుకున్న ఒప్పందంలో కీల‌క సూత్ర‌ధారి. ఆయ‌నను టీటీడీ ఈవోగా బ‌దిలీ చేశారు. ఆ త‌రువాత వ‌చ్చిన ఆర్మానే గిరిధ‌ర్ రాజ‌ధాని భూ స‌మీక‌ర‌ణ ఒప్పందాల వ్య‌వ‌హారాలను చూశారు. ఆ ప్ర‌క్రియ పూర్తి కాగానే ఆయ‌న‌ను కూడా పంపించి వేశారు. సీఆర్డీఏ క‌మిష‌న‌ర్ శ్రీ‌కాంత్‌కు స‌ర్వాధికారాలు క‌ట్ట‌బెట్టి అగ్రిమెంట్లు, భూమి స్వాధీనం వంటి ప‌లు వ్య‌వ‌హారాల‌ను ఆయ‌న చేతుల మీద‌గా నడిపించారు. ప్ర‌స్తుతం సీసీడీఏ అధికారాల‌ను ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ (ఐఅండ్ ఐ)కు అప్ప‌గించారు. ఈ శాఖ‌ను ప‌ర్య‌వేక్షించే బాధ్య‌త‌ను స్పెష‌ల్ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ ట‌క్క‌ర్‌కు అప్ప‌గించారు. అధికారుల‌ను నామ‌మాత్రంగా చేసి ముఖ్య‌మంత్రే ఏక‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రించాల‌న్న ఉద్దేశంతోనే అధికారుల‌తో కుర్చీలాట ఆడుతున్నార‌నే అభిప్రాయం స‌ర్వ‌త్రా విన‌ప‌డుతోంది.
First Published:  30 July 2015 2:45 AM GMT
Next Story