ముందే కూయాలి మరి..!
ఇది ఇన్ ఫర్మషన్ టెక్నాలజీ యుగం. ఏదేమైన స్పీడ్ ముఖ్యం. ఆలస్యం అయితే అంతే సంగతులు. సోషల్ నెట్ వర్క్ డెవలప్ అయిన తరువాత చేసుకున్నొడికి చేసుకున్నంత అన్న చందంగా మారింది. ప్రచార విషయంలో హాలీవుడ్ వాళ్లే మిగిలిన వారికి మార్గదర్శకులు. సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్… టీజర్ వంటి వాటిని సినిమా విడుదలకు యేడాది ముందుగానే రిలీజ్ చేసి అభిమానులకు ఒక సేంకేతం పంపుతారు. ఈ ట్రెండ్ ఇప్పుడిప్పుడే బాలీవుడ్ లోను అందుకుంటుంది. […]
BY admin30 July 2015 9:00 AM GMT
X
admin Updated On: 31 July 2015 12:35 AM GMT
ఇది ఇన్ ఫర్మషన్ టెక్నాలజీ యుగం. ఏదేమైన స్పీడ్ ముఖ్యం. ఆలస్యం అయితే అంతే సంగతులు. సోషల్ నెట్ వర్క్ డెవలప్ అయిన తరువాత చేసుకున్నొడికి చేసుకున్నంత అన్న చందంగా మారింది. ప్రచార విషయంలో హాలీవుడ్ వాళ్లే మిగిలిన వారికి మార్గదర్శకులు. సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్… టీజర్ వంటి వాటిని సినిమా విడుదలకు యేడాది ముందుగానే రిలీజ్ చేసి అభిమానులకు ఒక సేంకేతం పంపుతారు. ఈ ట్రెండ్ ఇప్పుడిప్పుడే బాలీవుడ్ లోను అందుకుంటుంది.
తాజాగా అజయ్ దేవగన్ లీడ్ రోల్ లో వస్తున్నశివాయ్ చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. అర్ధనగ్న దేహాంతో వంటి నిండా ట్యాటూలు వేసుకుని ఉన్న అజయ్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. చూస్తుంటే ఒక విధమైన ఆసక్తిని క్రియోట్ చేసేలా ఉంది. ఇక ఇదే తరహాలో షారుక్ నటిస్తున్న రాయిస్ .. అజాహార్ జీవిత కథ తో వస్తున్న ఈ చిత్రం యొక్క అజహర్ చిత్రాల ఫస్ట్ లుక్స్ ను రిలీజ్ చేశారు. అయితే అజయ్ దేవగన్ చేస్తున్న శివాయ్ చిత్రం 2017 లో రిలీజ్ అవుతుంది. అలాగే అజహార్ చిత్రం కూడా వచ్చే యేడాది విడుదల కానుంది. మరి ఇంత ముందుగా రిలీజ్ చేయడం అవసరమా అంటే.. విడతల వారిగా రిలీజ్ చేస్తుంటే.. సినిమాలకు ప్లస్ అవుతుంది అంటున్నారు విశ్లేషకులు. తేడా కొడితే మాత్రం మైనస్ అయ్యే అవకాశాలు కూడా లేక పోలేదు మరి.
Next Story