Telugu Global
Cinema & Entertainment

శ్రీమంతుడు తమిళ ఆడియో వాయిదా

శ్రీమంతుడు సినిమాను సెల్వంధన్ పేరిట తమిళ్ లో కూడా విడుదల చేయడానికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే తమిళనాట సెల్వంధన్ పోస్టర్లు హల్ చల్ చేస్తున్నాయి. మరోవైపు తమిళ వెర్షన్ కు సంబంధించిన ట్రయిలర్ కటింగ్ కూడా పూర్తయింది. ఈనెల 31న మహేష్ బాబు చేతుల మీదుగా తమిళ ఆడియో సాంగ్స్ ను కూడా విడుదల చేద్దామనుకున్నారు. కానీ సడెన్ గా ఆ ఫంక్షన్ ను వాయిదా వేశారు. ఈనెల 31న కాకుండా.. వచ్చేనెల 4వ తేదీన […]

శ్రీమంతుడు తమిళ ఆడియో వాయిదా
X
శ్రీమంతుడు సినిమాను సెల్వంధన్ పేరిట తమిళ్ లో కూడా విడుదల చేయడానికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే తమిళనాట సెల్వంధన్ పోస్టర్లు హల్ చల్ చేస్తున్నాయి. మరోవైపు తమిళ వెర్షన్ కు సంబంధించిన ట్రయిలర్ కటింగ్ కూడా పూర్తయింది. ఈనెల 31న మహేష్ బాబు చేతుల మీదుగా తమిళ ఆడియో సాంగ్స్ ను కూడా విడుదల చేద్దామనుకున్నారు. కానీ సడెన్ గా ఆ ఫంక్షన్ ను వాయిదా వేశారు. ఈనెల 31న కాకుండా.. వచ్చేనెల 4వ తేదీన చెన్నైలో జరిగే ఓ ఫంక్షన్ లో సెల్వంధన్ అలియాస్ శ్రీమంతుడు ఆడియో సాంగ్స్ ను విడుదల చేయాలని నిర్ణయించారు. ఆ రోజు ఫంక్షన్ కు మహేష్ హాజరై.. తన చేతుల మీదుగా ఆడియో సాంగ్స్ తో పాటు సెల్వంధన్ థియేట్రికల్ ట్రయిలర్ ను కూడా విడుదల చేస్తాడు. సినిమాకు జస్ట్ 3 రోజుల ముందు ఇలాంటి ఫంక్షన్ పెడితే.. కలెక్షన్లు మరిన్ని పెరుగుతాయనే ఆశాభావంలో ఉంది మహేష్ అండ్ కో. అందుకే.. 31 నుంచి ఆడియో ఫంక్షన్ ను 4కు పోస్ట్ పోన్ చేసింది. సినిమాలో మహేష్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. కొరాటల శివ దర్శకత్వంలో తెరకెక్కిన శ్రీమంతుడు సినిమాలో మహేష్ కు తండ్రిగా జగపతిబాబు నటించాడు. మైత్రీ మూవీస్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాతో మహేష్ కూడా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాడు.
First Published:  29 July 2015 7:05 PM GMT
Next Story