Telugu Global
Cinema & Entertainment

మ‌రో ఏక్ థా టైగ‌ర్  వ‌స్తుందా..?

బాలీవుడ్ లో  క‌బీర్ ఖాన్  సినిమా అంటే.. ఇండియా, పాకిస్తాన్ ..బోర్డ‌ర్ టెర్ర‌రిజ‌మ్,  ఈ మూడు అంశాలు  లేకుండా సినిమా వుండ‌దు.   స‌ల్మాన్ ఖాన్ తో   ఏక్ థా టైగ‌ర్ చిత్రంతో  భార‌త ర‌క్ష‌ణ సంస్థ‌,  పాకిస్తాన్ ర‌క్ష‌ణ సంస్థ‌లు మ‌ధ్య ఏ విధ‌మైన  లోసుగులు..లోపాలు ఉంటాయో ఎత్తి చూపాడు. మొన్న వ‌చ్చిన  భ‌జ‌రంగ్ భాయిజాన్ చిత్రం తో  మాన‌వ‌త్వానికి  మతం, దేశం ..ప‌రిమితులు లేవ‌ని చాటి  జ‌న నీరాజ‌నాలు అందుకున్నాడు.  ఇక తాజాగా    సైఫ్ అలీఖాన్, […]

మ‌రో ఏక్ థా టైగ‌ర్  వ‌స్తుందా..?
X

బాలీవుడ్ లో క‌బీర్ ఖాన్ సినిమా అంటే.. ఇండియా, పాకిస్తాన్ ..బోర్డ‌ర్ టెర్ర‌రిజ‌మ్, ఈ మూడు అంశాలు లేకుండా సినిమా వుండ‌దు. స‌ల్మాన్ ఖాన్ తో ఏక్ థా టైగ‌ర్ చిత్రంతో భార‌త ర‌క్ష‌ణ సంస్థ‌, పాకిస్తాన్ ర‌క్ష‌ణ సంస్థ‌లు మ‌ధ్య ఏ విధ‌మైన లోసుగులు..లోపాలు ఉంటాయో ఎత్తి చూపాడు. మొన్న వ‌చ్చిన భ‌జ‌రంగ్ భాయిజాన్ చిత్రం తో మాన‌వ‌త్వానికి మతం, దేశం ..ప‌రిమితులు లేవ‌ని చాటి జ‌న నీరాజ‌నాలు అందుకున్నాడు.
ఇక తాజాగా సైఫ్ అలీఖాన్, క‌త్రీనా కైఫ్ లీడ్ రోల్స్ లో ఫాంట‌మ్ అనే థ్రిల్ల‌ర్ చిత్రం చేశాడు. ఈ సినిమా ట్రైల‌ర్ రిలీజ్ అయ్యింది. చూస్తే.. క‌బీర్ ఖాన్ గ‌త చిత్రాల మాదిరే..ఇండియా, పాకిస్తాన్ మ‌ధ్య ఉగ్ర‌వాదం అంశాల్ని తీసుక‌ని చేసిన‌ట్లు స్ప‌ష్టం అవుతుంది. దీన్ని బ‌ట్టి చూస్తే క‌బీర్ ఖాన్ సినిమాలు చేసినంత కాలం ..ఇండియా, పాకిస్థాన మ‌ధ్య వివిధ ర‌కాలైన అంశాలే ఆయ‌న చిత్రాల క‌థ‌లు అనిపిస్తుంది. ఎప్ప‌టికి జాన‌ర్ మార్చి చేస్తాడో.. అస‌లు చేయ‌గ‌ల‌డో లేదో…! చేస్తే ఎలా వుంటుందో ..? ఈ చిత్రం ఆగ‌స్టు 28 న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేయ‌డానికి రంగం సిద్దం చేస్తున్నారు.

First Published:  28 July 2015 2:00 PM GMT
Next Story