Telugu Global
Cinema & Entertainment

ఆగ‌స్టు 7 న శ్రీ‌మంతుడు ఫిక్స్ అయ్యాడు...!

మ‌హేష్ అభిమానులు ఇక అడ్వాన్స్ బుకింగ్ ల‌కు సిద్దం కావొచ్చు. కొర‌టాల  శివ‌, మ‌హేష్ బాబు, శృతి హాస‌న్ లీడ్ రోల్స్ లో   వ‌స్తున్న  శ్రీ‌మంతుడు చిత్రం  థియేట‌ర్స్ వ‌ద్ద సంద‌డి చేయ‌డానికి రంగం సిద్దం అయ్యింది.  ఆగ‌స్టు 7 న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేయ‌డానికి రంగం సిద్దం చేశారు.  ఈ మ‌ధ్య‌నే  విడుద‌లైన ఆడియో  కు మంచి  స్పంద‌న వచ్చింది. అల్రేడి ప్ర‌చార చిత్రాలు మంచి ఇంప్రెష‌న్ క‌లిగించాయి.దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం […]

ఆగ‌స్టు 7 న శ్రీ‌మంతుడు ఫిక్స్ అయ్యాడు...!
X
మ‌హేష్ అభిమానులు ఇక అడ్వాన్స్ బుకింగ్ ల‌కు సిద్దం కావొచ్చు. కొర‌టాల శివ‌, మ‌హేష్ బాబు, శృతి హాస‌న్ లీడ్ రోల్స్ లో వ‌స్తున్న శ్రీ‌మంతుడు చిత్రం థియేట‌ర్స్ వ‌ద్ద సంద‌డి చేయ‌డానికి రంగం సిద్దం అయ్యింది. ఆగ‌స్టు 7 న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేయ‌డానికి రంగం సిద్దం చేశారు. ఈ మ‌ధ్య‌నే విడుద‌లైన ఆడియో కు మంచి స్పంద‌న వచ్చింది. అల్రేడి ప్ర‌చార చిత్రాలు మంచి ఇంప్రెష‌న్ క‌లిగించాయి.దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించాడు. విన‌డానికి కొన్ని పాట‌లు బావున్నాయి. చూడ‌టానికి ఎన్ని పాట‌లు బావుంటాయో రిలీజ్ అయిన త‌రువాత‌నే తెలియాలి.
గ‌తంలో మ‌హేష్ చేసిన రెండు చిత్రాలు.. నేనొక్క‌డినే.. అలాగే ఆగ‌డు రెండు చిత్రాలు బాక్సాపీస్ ద‌గ్గ‌ర నిరాశ ప‌రిచాయి, దీంతో ఈ సినిమాతో మంచి హిట్ ను ఆడియ‌న్స్ కు అందించాల‌నే గ‌ట్టి త‌లంపుతో కొరటాల అండ్ మ‌హేష్ బాబు వ‌ర్కువుట్ చేశారు. డెబ్యూ డైరెక్ట‌ర్ గా మిర్చి చిత్రం చేసిన కొర‌టాల శివ‌..డైరెక్ట‌ర్ గా త‌న స‌త్తా ఏమిటో ఘ‌నంగా చాటుకున్నాడు. దీంతో రెండో చిత్ర‌మే మ‌హేష్ బాబు తో చేస్తుండ‌టం అభిమానుల్లో అంచ‌నాలు పెంచింది. జ‌గ‌ప‌తి బాబు, రాజేంద్ర ప్ర‌సాద్ కీ రోల్స్ పోషించారు. సినిమా చాల రిచ్ గా ..భారీగా ఉంటుంద‌న‌డంలో సందేహాం లేదు. మ‌రి ఓవ‌రాల్ గా ఆడియ‌న్స్ జ‌డ్జిమెంట్ అనేది ఫైన‌ల్ కాబ‌ట్టి.. వారి తీర్పు ఏమిటి అనేది తెలియాలంటే ఆగ‌స్టు 7 వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.
First Published:  28 July 2015 1:03 AM GMT
Next Story