Telugu Global
Others

యాక్టర్లని మించిన యాక్టర్‌ కవిత?: పొన్నం

తెలంగాణ టీఆర్‌ఎస్‌ ఎంపీ కవిత సినీ యాక్టర్లను మించి నటిస్తోందని, ఆమె నటనను చూసి సినీ ఆర్టిస్టులే ఆశ్చర్యపోతున్నారన్నారు. ఐటీ బోనమంటూ బోనాలకు పేర్లు పెడుతూ బోనాల సంస్కృతినే అవహేళన చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన సీఎల్పీ కార్యాలయం వద్ద విలేకర్లతో మాట్లాడుతూ ఎంపీ కాకముందు, జాగృతి సంస్థ అధ్యక్షురాలు కాకముందు ఎప్పుడైనా ఆమె బోనమెత్తుకున్నదా అని నిలదీశారు. పుష్కర స్నానం చేసి పాపాలు కడుక్కో అంటూ ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీపై ఎంపీ కవిత చేసిన వ్యాఖ్యల పట్ల […]

తెలంగాణ టీఆర్‌ఎస్‌ ఎంపీ కవిత సినీ యాక్టర్లను మించి నటిస్తోందని, ఆమె నటనను చూసి సినీ ఆర్టిస్టులే ఆశ్చర్యపోతున్నారన్నారు. ఐటీ బోనమంటూ బోనాలకు పేర్లు పెడుతూ బోనాల సంస్కృతినే అవహేళన చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన సీఎల్పీ కార్యాలయం వద్ద విలేకర్లతో మాట్లాడుతూ ఎంపీ కాకముందు, జాగృతి సంస్థ అధ్యక్షురాలు కాకముందు ఎప్పుడైనా ఆమె బోనమెత్తుకున్నదా అని నిలదీశారు. పుష్కర స్నానం చేసి పాపాలు కడుక్కో అంటూ ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీపై ఎంపీ కవిత చేసిన వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్‌ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ తీవ్రంగా స్పందించారు. కవిత రోజుకో ఘాట్‌ తిరుగుతూ స్నానమాచరించిందని, అంటే ఆమె ఎంత పాపం చేసిందోనని దెప్పి పొడిచారు. పాపాలు కడుక్కోవడానికే ఆమె అన్ని ఘాట్లు తిరిగిందా అని ఎద్దేవా చేశారు.
First Published:  27 July 2015 1:17 PM GMT
Next Story