Telugu Global
Family

జర నవ్వండి ప్లీజ్ 157

యు ఆర్‌ వాచింగ్‌… భర్త ఇంట్లో హిడెన్‌ కెమేరా ఉందేమోనని వెతుకుతూ ఉంటే భార్య “ఏం వెతుకుతున్నావు?” అని అడిగింది. వెంటనే అతను నేను స్టార్‌ టీవీ చూస్తూ ఉంటే అనౌన్సర్‌ “యు ఆర్‌ వాచింగ్‌ స్టార్‌ టీవీ” అని అంది. ఎలా కనుక్కుందో అని వెతుకుతున్నాను” అన్నాడు. ——————————————————————– ముష్టిపూర్తి పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి షష్టిపూర్తికి, మిత్రుడు ఎ.ఆర్‌. కృష్ణ పురాణం గారికి కొంత సొమ్ము బహూకరించడానికి తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి డబ్బు […]

యు ఆర్‌ వాచింగ్‌…
భర్త ఇంట్లో హిడెన్‌ కెమేరా ఉందేమోనని వెతుకుతూ ఉంటే భార్య “ఏం వెతుకుతున్నావు?” అని అడిగింది. వెంటనే అతను నేను స్టార్‌ టీవీ చూస్తూ ఉంటే అనౌన్సర్‌ “యు ఆర్‌ వాచింగ్‌ స్టార్‌ టీవీ” అని అంది. ఎలా కనుక్కుందో అని వెతుకుతున్నాను” అన్నాడు.
——————————————————————–
ముష్టిపూర్తి
పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి షష్టిపూర్తికి, మిత్రుడు ఎ.ఆర్‌. కృష్ణ పురాణం గారికి కొంత సొమ్ము బహూకరించడానికి తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి డబ్బు పోగుచెయ్యడానికి పూనుకున్నాడు. ఒకసారి రావిశాస్త్రి “వరద”ని అడిగారు “షష్టిపూర్తి” కలెక్షన్‌ పూర్తయిందా?” అని “షష్టిపూర్తి అయిపోయిందిగాని, “ముష్టిపూర్తి” ఇంకా కాలేదు” అన్నారు “వరద”.
——————————————————————–
అవార్డులు

“అవార్డులు రావడం గురించి మీ అభిప్రాయం ఏమిటి?” అని ఒక పత్రికా విలేకరి అడిగినప్పుడు, “అవి రావు, కావల్సిన వాళ్ళు కష్టపడి సంపాదించుకోవాలి” అన్నారు “వరద”
——————————————————————–
“నీసువాసన”

ఓసారి మా అన్నయ్య కూతురు వచ్చింది మా ఇంటికి హాస్టల్‌ నుంచి. నేను దానితో కూర్చుని మాట్లాడుతున్నాను. ఆయన లోపలి నుంచి అక్కడకి వస్తూనే “ఏమిటే నీసువాసన వేస్తోంది?” అన్నారు మొహం అదోలాపెట్టి. మేమిద్ధరం ఇటూ అటూ వాసన పీల్చి చూశాం. ఏమీ అనిపించలేదు.
“మీకెక్కడ నుంచి వేస్తోంది. మావయ్యగారూ?” అంది మా అన్నయ్య కూతురు.
“నువ్వు “నీస్‌”వి కదుటే, నువ్వు రాగానే “నీసువాసన” వెయ్యదూ?” అన్నారు నవ్వుతూ.

First Published:  27 July 2015 1:03 PM GMT
Next Story