Telugu Global
Others

ఈక్విటీల్లో ఆరు వేల కోట్ల ఈపీఎఫ్‌ నిధులు

కేంద్ర కార్మిక శాఖ పర్యవేక్షణలోని ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌(ఈపీఎఫ్‌)కు సంబంధించిన ఆరువేల కోట్ల రూపాయల నిధులను ఈక్విటీ షేర్లలో పెట్టుబడులుగా పెట్టబోతున్నట్లు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనాశాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడించారు. ఈపీఎఫ్‌ ఖాతాలో ఉన్న మొత్తం రూ. 8.30 లక్షల కోట్ల నిధుల్లో… మొదట ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు… ఇలా 15 శాతం వరకు నిధులను ఈక్విటీ షేర్లలోకి మళ్లిస్తామని చెప్పారు. ఈపీఎఫ్‌ నిధులను షేర్ల బిజినెస్‌లో పెట్టడం వల్ల […]

కేంద్ర కార్మిక శాఖ పర్యవేక్షణలోని ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌(ఈపీఎఫ్‌)కు సంబంధించిన ఆరువేల కోట్ల రూపాయల నిధులను ఈక్విటీ షేర్లలో పెట్టుబడులుగా పెట్టబోతున్నట్లు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనాశాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడించారు. ఈపీఎఫ్‌ ఖాతాలో ఉన్న మొత్తం రూ. 8.30 లక్షల కోట్ల నిధుల్లో… మొదట ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు… ఇలా 15 శాతం వరకు నిధులను ఈక్విటీ షేర్లలోకి మళ్లిస్తామని చెప్పారు. ఈపీఎఫ్‌ నిధులను షేర్ల బిజినెస్‌లో పెట్టడం వల్ల గ్యారంటీ ఉంటుందా అని ప్రశ్నిస్తే… తాము స్వల్పకాలికంగా ఇన్వెస్ట్‌ చేయడం లేదని, దాదాపు పదేళ్లకుపైగా ఇన్వెస్ట్‌ చేస్తున్నామని, ఇలాంటి దీర్ఘకాలిక మదుపు వల్ల లాభాలుంటాయని, కార్మికులకు కూడా ప్రయోజనాలు చేకూరుతాయని వివరించారు.
First Published:  27 July 2015 1:13 PM GMT
Next Story