Telugu Global
Others

ప‌గ‌టి క‌ల‌లు మానుకో బాబు " మంత్రి హ‌రీశ్‌రావు 

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు ప‌గ‌టి క‌ల‌లు క‌న‌డం మానుకోవాల‌ని తెలంగాణ మంత్రి హ‌రీశ్‌రావు సూచించారు. ఏపీ, తెలంగాణ ప్ర‌జ‌లు తిరిగి క‌లిసి పోతార‌ని చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌ల‌ను ఆయ‌న త‌ప్పు ప‌ట్టారు. ప‌గిలిన అద్దం, విరిగిన మ‌న‌సు ఎప్ప‌టికీ క‌ల‌వ్వ‌ని, ఆ విష‌యం చంద్ర‌బాబు గుర్తుంచుకోవాల‌ని హ‌రీశ్ హిత‌వు ప‌లికారు. తెలంగాణ అభివృద్ధికి నిత్యం అడ్డుప‌డుతున్న చంద్ర‌బాబును ప్ర‌జ‌లు అస‌హ్యించుకుంటున్నార‌ని ఆయ‌న అన్నారు. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌ జిల్లా వ‌న‌ప‌ర్తి మున్సిప‌ల్ చైర్మ‌న్ ప‌లుస ర‌మేశ్‌గౌడ్‌తో పాటు ప‌ల‌వురు టీడీపీ, […]

Harish Rao
X
ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు ప‌గ‌టి క‌ల‌లు క‌న‌డం మానుకోవాల‌ని తెలంగాణ మంత్రి హ‌రీశ్‌రావు సూచించారు. ఏపీ, తెలంగాణ ప్ర‌జ‌లు తిరిగి క‌లిసి పోతార‌ని చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌ల‌ను ఆయ‌న త‌ప్పు ప‌ట్టారు. ప‌గిలిన అద్దం, విరిగిన మ‌న‌సు ఎప్ప‌టికీ క‌ల‌వ్వ‌ని, ఆ విష‌యం చంద్ర‌బాబు గుర్తుంచుకోవాల‌ని హ‌రీశ్ హిత‌వు ప‌లికారు. తెలంగాణ అభివృద్ధికి నిత్యం అడ్డుప‌డుతున్న చంద్ర‌బాబును ప్ర‌జ‌లు అస‌హ్యించుకుంటున్నార‌ని ఆయ‌న అన్నారు. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌ జిల్లా వ‌న‌ప‌ర్తి మున్సిప‌ల్ చైర్మ‌న్ ప‌లుస ర‌మేశ్‌గౌడ్‌తో పాటు ప‌ల‌వురు టీడీపీ, కాంగ్రెస్ నేత‌లు టీఆర్ఎస్ లో చేరిన సంద‌ర్భంగా జ‌రిగిన స‌భ‌లో హ‌రీశ్ ప్ర‌సంగించారు.
First Published:  25 July 2015 1:09 PM GMT
Next Story