Telugu Global
NEWS

గ్రామాలను ఖాళీ చేయించాలని చూస్తే బాబుకు మా తడాఖా చూపిస్తాం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ప్ర‌తిపాదిత‌ నూత‌న‌ రాజధాని సీడ్‌ క్యాపిటల్‌ పరిధిలోని మూడు గ్రామాల ప్రజలు ఆందోళ‌న‌బాట ప‌ట్టారు. గ్రామాలను ఖాళీ చేయించాలని చూస్తే తడాఖా చూపిస్తాం అంటూ తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం, ఉద్దండ్రాయునిపాలెం, లింగాయపాలెం గ్రామాలకు చెందిన ప్రజలు తుళ్లూరు సిఆర్‌డిఏ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ‘మా గ్రామాలే కాదు.. ఏ గ్రామంలోనూ ఒక్క ఇటుక కూడా కదలనివ్వం’ అని వారు స్ప‌ష్టం చేశారు. సిపిఎం ఆధ్వ‌ర్యంలో జరిగిన ఈ ఆందోళనలో ప్రజలు […]

గ్రామాలను ఖాళీ చేయించాలని చూస్తే బాబుకు మా తడాఖా చూపిస్తాం
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ప్ర‌తిపాదిత‌ నూత‌న‌ రాజధాని సీడ్‌ క్యాపిటల్‌ పరిధిలోని మూడు గ్రామాల ప్రజలు ఆందోళ‌న‌బాట ప‌ట్టారు. గ్రామాలను ఖాళీ చేయించాలని చూస్తే తడాఖా చూపిస్తాం అంటూ తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం, ఉద్దండ్రాయునిపాలెం, లింగాయపాలెం గ్రామాలకు చెందిన ప్రజలు తుళ్లూరు సిఆర్‌డిఏ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ‘మా గ్రామాలే కాదు.. ఏ గ్రామంలోనూ ఒక్క ఇటుక కూడా కదలనివ్వం’ అని వారు స్ప‌ష్టం చేశారు. సిపిఎం ఆధ్వ‌ర్యంలో జరిగిన ఈ ఆందోళనలో ప్రజలు ఇటుకలు, నల్లజెండాలు చేత పట్టి విన్నూత రీతిలో నిరసన తెలిపారు. ఎవరెన్ని ప్యాకేజీలు ప్రకటించినా తాము గ్రామాలను వదిలివెళ్లబోమని స్పష్టం చేశారు. ధ‌ర్నా కార్య‌క్ర‌మంలో సిపిఎం క్రిడా ప్రాంత కన్వీనర్‌ సిహెచ్‌ బాబూరావు మాట్లాడుతూ.. భూ సమీకరణ ముందు గ్రామాలను కదిలించబోమని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు మాట‌మారుస్తోంద‌న్నారు. గ్రామాల ఉనికి గురించి సీడ్‌ క్యాపిటల్‌ ప్రణాళికలో ఎక్కడా పొందుపరచలేదని పేర్కొన్నారు. ఈ గ్రామాల పరిధిలో భారీ నిర్మాణాలు చేపడుతూ గ్రామాలను కదలించబోమని ఒక సారి, కొన్ని చిన్న గ్రామాలు పోతాయని మరొక సారి ప్రభుత్వ పెద్దలు ర‌క‌ర‌కాల‌ ప్రకటనలు చేస్తున్నారని, ప్ర‌జ‌ల్లో తీవ్ర గంద‌ర‌గోళం సృష్టిస్తున్నార‌ని విమర్శించారు. నిజంగా గ్రామాలను కదలించే ఉద్దేశ్యమే లేకపోతే ఈ మేరకు గ్రామ సభలు నిర్వహించి ప్రజల మధ్యకు వచ్చి ఏం చేయబోతున్నారో స్పష్టంగా చెప్పాలన్నారు. గ్రామాల్లోని ఇళ్లను తొలగిస్తే మొదట నష్టపోయేది పేదలు, దళితులేనని చెప్పారు. గ్రామాలను తొలగించకపోతే వెంటనే ఆ మేరకు ప్రభుత్వం స్పష్టమైన ఉత్తర్వులివ్వాలని బాబూరావు డిమాండ్‌ చేశారు.
First Published:  25 July 2015 12:12 AM GMT
Next Story