Telugu Global
Cinema & Entertainment

 మెగా ఫ్యామిలి హీరోకి అయిదుగురు భామలు...?

మొన్నటిదాకా సింగిల్ హీరోయిన్ తోనే సినిమాలు లాగించిన స్టార్స్ అంతా ఇప్పుడు మరోసారి పాత పద్దతిలోకి మారినట్టు కనిపిస్తోంది. కుదిరితే ముగ్గురు… కనీసం ఇద్దరు భామలతో రొమాన్స్ చేయాలనుకుంటున్నారు. మహేష్ కొత్త సినిమా బ్రహ్మోత్సవంలో ఏకంగా ముగ్గురు భామల్ని తీసుకున్నారు. ఇప్పుడు మరో మెగా హీరో కూడా అదే పద్దతి ఫాలో అయిపోతున్నాడు. మెగా కాంపౌండ్ నుంచి వడివడిగా అడుగులు వేస్తున్న సాయిధర్మతేజ కొత్త సినిమాలో ఏకంగా ఐదుగురు ముద్దుగుమ్మల్ని తీసుకోవాలని నిర్ణయించారు. త్వరలోనే సునీల్ రెడ్డి […]

 మెగా ఫ్యామిలి హీరోకి అయిదుగురు భామలు...?
X
మొన్నటిదాకా సింగిల్ హీరోయిన్ తోనే సినిమాలు లాగించిన స్టార్స్ అంతా ఇప్పుడు మరోసారి పాత పద్దతిలోకి మారినట్టు కనిపిస్తోంది. కుదిరితే ముగ్గురు… కనీసం ఇద్దరు భామలతో రొమాన్స్ చేయాలనుకుంటున్నారు. మహేష్ కొత్త సినిమా బ్రహ్మోత్సవంలో ఏకంగా ముగ్గురు భామల్ని తీసుకున్నారు. ఇప్పుడు మరో మెగా హీరో కూడా అదే పద్దతి ఫాలో అయిపోతున్నాడు. మెగా కాంపౌండ్ నుంచి వడివడిగా అడుగులు వేస్తున్న సాయిధర్మతేజ కొత్త సినిమాలో ఏకంగా ఐదుగురు ముద్దుగుమ్మల్ని తీసుకోవాలని నిర్ణయించారు. త్వరలోనే సునీల్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు సాయిధర్మతేజ. ఇందులో ఏకంగా ఐదుగురు హీరోయిన్లు ఉండబోతున్నారు. ఈ విషయాన్ని సాయి అధికారికంగా ప్రకటించాడు. అయితే ఆ హీరోయిన్లు ఎవరనే విషయాన్ని మాత్రం ఇంకా కన్ ఫర్మ్ చేయలేదు. ప్రస్తుతానికి రెజీనా, నందిత, నిత్యామీనన్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. కుదిరితే ఆ ముగ్గుర్నీ తీసుకొని, మరో ఇద్దరి కోసం ప్రయత్నించాలని భావిస్తున్నారు. సాయిధర్మతేజతో రెజీనా ఇప్పటికే పిల్లా నువ్వులేని జీవితం అనే సినిమా చేసింది. ఐదుగురు హీరోయిన్లతో సాయిధర్మతేజ చేయబోయే సినిమాపై ఇప్పట్నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలైంది.
First Published:  24 July 2015 7:20 PM GMT
Next Story