Telugu Global
Others

టాస్క్‌ఫోర్స్‌కు చిక్కిన బెట్టింగ్‌ భాయ్!

ఆంధ్రతోపాటు రాజస్థాన్‌, పంజాబ్‌, హర్యానా రాష్ర్టాల్లో క్రికెట్ బెట్టింగ్‌ను అరచేతిలో ఆడిస్తున్న నిక్కూభాయ్ అలియాస్ సత్యప్రసాద్ జిందాల్ నగర పోలీసులకు చిక్కాడు. హైదరాబాద్ ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ క్రికెట్ బెట్టింగ్ మీద చేసిన ఒక ఆపరేషన్‌లో నిక్కూ దొరికిపోయాడు. మొదట్లో సాధారణ బుకీగా భావించిన పోలీసులు తాము పట్టుకున్నది ఓ తిమింగిలాన్ని అని తెలిసి ఆశ్చర్యపోతున్నారు. బెట్టింగ్ మాఫియాలో అతి స్వల్పకాలంలో కింగ్‌గా ఎదిగిన నిక్కూభాయ్ మహరాష్ట్రలోని ఆర్కోట్ ప్రాంతానికి చెందినవాడు. రాజస్థాన్‌లో క్రికెట్ బెట్టింగ్ ప్రారంభించి క్రమంగా […]

ఆంధ్రతోపాటు రాజస్థాన్‌, పంజాబ్‌, హర్యానా రాష్ర్టాల్లో క్రికెట్ బెట్టింగ్‌ను అరచేతిలో ఆడిస్తున్న నిక్కూభాయ్ అలియాస్ సత్యప్రసాద్ జిందాల్ నగర పోలీసులకు చిక్కాడు. హైదరాబాద్ ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ క్రికెట్ బెట్టింగ్ మీద చేసిన ఒక ఆపరేషన్‌లో నిక్కూ దొరికిపోయాడు. మొదట్లో సాధారణ బుకీగా భావించిన పోలీసులు తాము పట్టుకున్నది ఓ తిమింగిలాన్ని అని తెలిసి ఆశ్చర్యపోతున్నారు. బెట్టింగ్ మాఫియాలో అతి స్వల్పకాలంలో కింగ్‌గా ఎదిగిన నిక్కూభాయ్ మహరాష్ట్రలోని ఆర్కోట్ ప్రాంతానికి చెందినవాడు. రాజస్థాన్‌లో క్రికెట్ బెట్టింగ్ ప్రారంభించి క్రమంగా హైదరాబాద్‌తో పాటు ఆంధ్రప్రదేశ్, హర్యానా, పంజాబ్ రాష్ర్టాలకు కార్యకలాపాలు విస్తరించాడు. నాలుగు రాష్ర్టాల్లో సొంతంగా బెట్టింగ్ సెషన్స్ గేమ్ ఆడించే స్థాయికి ఎదిగాడు. నిక్కూ అరెసు బెట్టింగ్ మాఫి యాలో కలకలం రేపుతున్నది. ఒక్కో సెషన్‌కు రూ. 300 కోట్ల బిజినెస్ చేసే నిక్కూను పట్టుకోవడంతో హైదరాబాద్ పోలీసులపై ప్రశంసల వర్షం కురుస్తున్నది.
First Published:  23 July 2015 1:06 PM GMT
Next Story