Telugu Global
CRIME

 భార్య‌ను అలా చూడ‌లేకే..!

ఏడ‌డుగుల సంబంధం ముడిప‌డి ఎనిమిది నెల‌లు కూడా కాలేదు. వివాహ‌బంధాన్ని విహ‌హేత‌ర సంబంధం విచ్ఛిన్నం చేసింది. నా చావుకు భార్య వివాహేత‌ర సంబంధ‌మే కార‌ణ‌మంటూ, ఆమె ప్రియుడి ఫోన్ నెంబ‌ర్ రాసి పెట్టి మ‌రీ బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డాడు వ‌రంగ‌ల్ జిల్లా ప‌ర‌కాల‌కు చెందిన‌ ప‌ల్లె చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి. కేపీహెచ్‌బీ కాల‌నీలో నివాసం ఉంటున్న చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి ఓ షోరూంలో అకౌంటెంట్‌గా ప‌నిచేస్తున్నాడు. 8 నెల‌ల క్రితం గుంటూరు జిల్లాకు స‌రిపురానికి చెందిన స‌రిత‌తో చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డికి వివాహ‌మైంది. గురువారం త‌న సోద‌రి […]

 భార్య‌ను అలా చూడ‌లేకే..!
X
ఏడ‌డుగుల సంబంధం ముడిప‌డి ఎనిమిది నెల‌లు కూడా కాలేదు. వివాహ‌బంధాన్ని విహ‌హేత‌ర సంబంధం విచ్ఛిన్నం చేసింది. నా చావుకు భార్య వివాహేత‌ర సంబంధ‌మే కార‌ణ‌మంటూ, ఆమె ప్రియుడి ఫోన్ నెంబ‌ర్ రాసి పెట్టి మ‌రీ బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డాడు వ‌రంగ‌ల్ జిల్లా ప‌ర‌కాల‌కు చెందిన‌ ప‌ల్లె చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి. కేపీహెచ్‌బీ కాల‌నీలో నివాసం ఉంటున్న చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి ఓ షోరూంలో అకౌంటెంట్‌గా ప‌నిచేస్తున్నాడు. 8 నెల‌ల క్రితం గుంటూరు జిల్లాకు స‌రిపురానికి చెందిన స‌రిత‌తో చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డికి వివాహ‌మైంది. గురువారం త‌న సోద‌రి ప్రియాంకారెడ్డికి ఫోన్ చేసి తాను చ‌నిపోతున్నాన‌ని చెప్పి.. మొబైల్ పాస్‌వ‌ర్డ్‌ను కూడా మెసేజ్ చేశాడు చంద్ర‌శేఖ‌ర్‌.. ప్రియాంక అప్ర‌మ‌త్త‌మై హైద‌రాబాద్‌లో ఉన్న బంధువుల‌కు స‌మాచారం ఇచ్చింది. వారు వ‌చ్చేస‌రికి చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి చ‌నిపోయాడు. దిండు కింద ల‌భించిన సూసైడ్ నోట్‌లో “త‌న చావుకు కార‌ణం భార్య స‌రిత‌, ఆమె ప్రియుడు బాలాజీ అని..ఇద్ద‌రూ త‌న‌కు చాలా హింసించారు“ అని రాసి ఉంది. సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు ద‌ర్యాప్తు చేస్తున్నారు.
Next Story