Telugu Global
Others

డాక్టర్లకు తెల్ల‌కోటుకు ఇన్‌ఫెక్షన్‌ రోగం!

ఆస్పత్రుల్లో ఇన్‌ఫెక్షన్‌ వ్యాప్తి చెందడానికి డాక్టర్లు, మెడికోలు, నర్సులు తెల్లకోట్లు ధరించడమే కారణమని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే వీరు ఈ తరహా దుస్తులను ధరించకుండా ఉండాలని కోరుతున్నారు అధ్యయనకారులు. పొడుగు చేతులున్న తెల్ల‌కోటు వ‌ల్ల ఇన్‌ఫెక్ష‌న్ వ్యాప్తి చెంది రోగుల‌కు హాని క‌లుగుతోంది. అందువ‌ల్ల వీటిని నిషేధించాల‌ని బెంగ‌ళూరులోని యెనెపొయా మెడిక‌ల్ కాలేజీ పోస్టు గ్రాడ్యుయేట్ విద్యార్థి ఎడ్మండ్ ఫెర్నాండేజ్ కోరారు. మ‌న దేశంలో డ్రస్సుల‌ను మార్చుకునే స్థ‌లం లేదు. డాక్ట‌ర్లు, మెడికోలు, నర్సులు ఈ తెల్ల‌కోట్ల‌ను […]

ఆస్పత్రుల్లో ఇన్‌ఫెక్షన్‌ వ్యాప్తి చెందడానికి డాక్టర్లు, మెడికోలు, నర్సులు తెల్లకోట్లు ధరించడమే కారణమని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే వీరు ఈ తరహా దుస్తులను ధరించకుండా ఉండాలని కోరుతున్నారు అధ్యయనకారులు. పొడుగు చేతులున్న తెల్ల‌కోటు వ‌ల్ల ఇన్‌ఫెక్ష‌న్ వ్యాప్తి చెంది రోగుల‌కు హాని క‌లుగుతోంది. అందువ‌ల్ల వీటిని నిషేధించాల‌ని బెంగ‌ళూరులోని యెనెపొయా మెడిక‌ల్ కాలేజీ పోస్టు గ్రాడ్యుయేట్ విద్యార్థి ఎడ్మండ్ ఫెర్నాండేజ్ కోరారు. మ‌న దేశంలో డ్రస్సుల‌ను మార్చుకునే స్థ‌లం లేదు. డాక్ట‌ర్లు, మెడికోలు, నర్సులు ఈ తెల్ల‌కోట్ల‌ను ఎక్క‌డ ప‌డితే అక్క‌డ పెడుతుంటారు. మళ్ళీ మళ్లీ అవే వేసుకుంటూ ఉంటారు. అందువ‌ల్ల ఇన్‌ఫెక్ష‌న్ ఎక్కువ‌గా వ్యాప్తి చెందుతోంద‌ని ఆయ‌న అన్నారు. 19వ శ‌తాబ్దం నుంచి వాడుక‌లో ఉన్న ఈ తెల్ల‌కోటును మ‌న‌దేశంలో నిషేధించాల‌ని ఆయ‌న కోరారు. ఇదే కారణమైతే మరి ఏ తరహా దుస్తులు ధరించినా ఎక్కడబడితే అక్కడ తగిలించడం… మళ్ళీ మళ్ళీ అవే ధరించడం జరుగుతుంది కదా… అప్పుడు పరిస్థితి మళ్ళీ మామూలేగా అంటున్నారు డాక్టర్లు. నిజమే కదా!
First Published:  22 July 2015 1:12 PM GMT
Next Story