Telugu Global
Others

ఏపీకి ప్రత్యేక హోదాపై మౌనముద్ర!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు ప్ర‌త్యేక హోదాపై అధికార‌, ప్ర‌తిప‌క్ష‌నేత‌లు మౌన‌ముద్ర‌ను పాటిస్తున్నాయి. ప్ర‌త్యేక హోదా ద‌క్క‌ద‌నే ప‌క్కా స‌మాచారం కేంద్ర ప్ర‌భుత్వం నుంచి నాలుగు నెల‌ల క్రిత‌మే రాష్ట్ర అధికారులకు అందినా అధికార‌, ప్ర‌తిప‌క్షాలు ప‌ట్టించుకోవ‌డం లేదు. గ‌తంలో ప్ర‌త్యేక హోదా ద‌క్కుతుంద‌ని ప‌దేప‌దే ప్ర‌చారం చేసిన సీఎం చంద్ర‌బాబు ఆ విష‌యంపై ఇప్ప‌డు మాట్లాడ‌డం మానేశారు. ఇక ప్ర‌తిప‌క్ష‌నేత జ‌గ‌న్ కూడా ఈ అంశంపై స్పందించ‌డం లేదు. కేంద్రంతో వివాదాలు తెచ్చుకోవ‌డం చంద్ర‌బాబుకు, జ‌గ‌న్‌కు ఇష్టం లేనందునే […]

ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు ప్ర‌త్యేక హోదాపై అధికార‌, ప్ర‌తిప‌క్ష‌నేత‌లు మౌన‌ముద్ర‌ను పాటిస్తున్నాయి. ప్ర‌త్యేక హోదా ద‌క్క‌ద‌నే ప‌క్కా స‌మాచారం కేంద్ర ప్ర‌భుత్వం నుంచి నాలుగు నెల‌ల క్రిత‌మే రాష్ట్ర అధికారులకు అందినా అధికార‌, ప్ర‌తిప‌క్షాలు ప‌ట్టించుకోవ‌డం లేదు. గ‌తంలో ప్ర‌త్యేక హోదా ద‌క్కుతుంద‌ని ప‌దేప‌దే ప్ర‌చారం చేసిన సీఎం చంద్ర‌బాబు ఆ విష‌యంపై ఇప్ప‌డు మాట్లాడ‌డం మానేశారు. ఇక ప్ర‌తిప‌క్ష‌నేత జ‌గ‌న్ కూడా ఈ అంశంపై స్పందించ‌డం లేదు. కేంద్రంతో వివాదాలు తెచ్చుకోవ‌డం చంద్ర‌బాబుకు, జ‌గ‌న్‌కు ఇష్టం లేనందునే మౌనంగా ఉంటున్నార‌ని అధికారులు భావిస్తున్నారు. పార్ల‌మెంటు స‌మావేశాలు ప్రారంభ‌మైనా టీడీపీ వైఎస్సార్ సీపీ ఎంపీల ప్ర‌వ‌ర్తిస్తున్న తీరు అందుకు అద్దం ప‌డుతుంద‌ని మేథావులు విమ‌ర్శిస్తున్నారు. అయితే కేంద్ర‌మంత్రి సుజ‌నాచౌద‌రి మాత్రం త్వ‌ర‌లో ఏపీకి ప్ర‌త్యేక హోదా ద‌క్కుతుంద‌నే ప్ర‌చారాన్ని వదలడం లేదు. ఆయనకున్న సమాచారం ఏమిటో అర్ధం కాక మిగిలివారు ఏమీ పాలుపోక దిక్కులు చూస్తున్నారు.
First Published:  22 July 2015 1:14 PM GMT
Next Story