Telugu Global
Cinema & Entertainment

 శివం రెడీ చేసిన రామ్

పండగ చేస్కో ఊహించని విజయం సాధించడంతో ఆ ఊపులో అప్పుడే మరో సినిమాను సిద్ధంచేశాడు హీరో రామ్. తను ఎంతో ఇష్టపడి ఒప్పుకున్న శివం సినిమాను ఏకథాటిగా పూర్తిచేశాడు. కొత్తకుర్రాడు శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో చేసిన శివం సినిమాను వినాయక చవితి కానుకగా థియేటర్లలోకి తీసుకురావాలనుకుంటున్నాడు. అనుకున్న ప్రకారం షెడ్యూల్స్ అన్నీ పూర్తిచేసి సెప్టెంబర్ 17న శివం సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నాడు. ఈ సినిమాలో రామ్ సరసన రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే సినిమా […]

 శివం రెడీ చేసిన రామ్
X
పండగ చేస్కో ఊహించని విజయం సాధించడంతో ఆ ఊపులో అప్పుడే మరో సినిమాను సిద్ధంచేశాడు హీరో రామ్. తను ఎంతో ఇష్టపడి ఒప్పుకున్న శివం సినిమాను ఏకథాటిగా పూర్తిచేశాడు. కొత్తకుర్రాడు శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో చేసిన శివం సినిమాను వినాయక చవితి కానుకగా థియేటర్లలోకి తీసుకురావాలనుకుంటున్నాడు. అనుకున్న ప్రకారం షెడ్యూల్స్ అన్నీ పూర్తిచేసి సెప్టెంబర్ 17న శివం సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నాడు. ఈ సినిమాలో రామ్ సరసన రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే సినిమా టాకీపార్ట్ మొత్తం పూర్తయింది. వచ్చే నెల నుంచి రామోజీ ఫిలింసిటీలో పాటల చిత్రీకరణ ఉంటుంది. ఆగస్ట్ చివరి వారం లేదా సెప్టెంబర్ మొదటివారంలో ఆడియోను విడుదల చేసి, సెప్టెంబర్ 17న శివంను థియేటర్లలోకి తీసుకురావాలనుకుంటున్నారు. శివం సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు. స్రవంతి మూవీస్ బ్యానర్ పై స్రవంతి రవికిషోర్ నిర్మిస్తున్న ఈ సినిమాను కృష్ణ చైతన్య సమర్పిస్తున్నారు. ఈ ఏడాదిలో రామ్ నుంచి వస్తున్న రెండో సినిమా ఇది.
First Published:  20 July 2015 9:00 PM GMT
Next Story