రుణమాఫీ రెండో విడత సొమ్ము మంజూరుకు రంగం సిద్ధం
తెలంగాణ రైతాంగానికి పంట రుణమాఫీ రెండో విడతలోని మిగతా సొమ్మును మంజూరు చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఒకట్రెండు రోజుల్లో రూ. 2,043 కోట్లను బ్యాంకుల్లో జమ చేస్తామని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో ప్రభుత్వం హామీ ఇచ్చింది, అర్హులకే రుణమాఫీ సొమ్ము అందేలా చూడాలని అధికారులను ఆదేశించింది. రాష్ట్రంలోని 35.82 లక్షల మంది రైతులకు రూ. లక్షలోపు పంట రుణాలను మాఫీ చేస్తామని గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ హామీ మేరకు రూ. […]
BY sarvi20 July 2015 1:06 PM GMT
sarvi Updated On: 20 July 2015 11:59 PM GMT
తెలంగాణ రైతాంగానికి పంట రుణమాఫీ రెండో విడతలోని మిగతా సొమ్మును మంజూరు చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఒకట్రెండు రోజుల్లో రూ. 2,043 కోట్లను బ్యాంకుల్లో జమ చేస్తామని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో ప్రభుత్వం హామీ ఇచ్చింది, అర్హులకే రుణమాఫీ సొమ్ము అందేలా చూడాలని అధికారులను ఆదేశించింది. రాష్ట్రంలోని 35.82 లక్షల మంది రైతులకు రూ. లక్షలోపు పంట రుణాలను మాఫీ చేస్తామని గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ హామీ మేరకు రూ. 17 వేల కోట్లను నాలుగు విడతల్లో రైతులకు చెల్లిస్తామని ప్రకటించింది. ఇప్పటివరకూ రెండు విడతలుగా సొమ్ము విడుదల చేసిన ప్రభుత్వం మరో రెండు దఫాల్లో రైతు పంట రుణమాఫీ చేయాల్సి ఉంది.
Next Story