Telugu Global
Cinema & Entertainment

హాలీవుడ్ నటి ఇంట్లో శవం

డెమీ మూర్.. దశాబ్దం కిందట వరకు యావత్ ప్రపంచాన్ని ఊపేసిన పేరిది. హాలీవుడ్ లో తిరుగులేని గ్లామరస్ హీరోయిన్ గా పేరుతెచ్చుకుంది డెమీ మూర్. ప్రపంచవ్యాప్తంగా ఆమెకు అభిమానులున్నారు. అలాంటి నటి ఇంట్లో అకస్మాత్తుగా శవం ప్రత్యక్షమైంది. లాస్ ఎంజెలెస్ లోని డెమీ మూర్ ఇంట్లోని స్విమ్మింగ్ పూల్ లో 21ఏళ్ల యువకుడి శవం కనిపించింది. ఆ సమయంలో డెమీ మూర్ ఇంట్లో లేదు. తన కూతురు బర్త్ డే ఫంక్షన్ కోసం వేరే రాష్ట్రానికి వెళ్లింది. […]

హాలీవుడ్ నటి ఇంట్లో శవం
X
డెమీ మూర్.. దశాబ్దం కిందట వరకు యావత్ ప్రపంచాన్ని ఊపేసిన పేరిది. హాలీవుడ్ లో తిరుగులేని గ్లామరస్ హీరోయిన్ గా పేరుతెచ్చుకుంది డెమీ మూర్. ప్రపంచవ్యాప్తంగా ఆమెకు అభిమానులున్నారు. అలాంటి నటి ఇంట్లో అకస్మాత్తుగా శవం ప్రత్యక్షమైంది. లాస్ ఎంజెలెస్ లోని డెమీ మూర్ ఇంట్లోని స్విమ్మింగ్ పూల్ లో 21ఏళ్ల యువకుడి శవం కనిపించింది. ఆ సమయంలో డెమీ మూర్ ఇంట్లో లేదు. తన కూతురు బర్త్ డే ఫంక్షన్ కోసం వేరే రాష్ట్రానికి వెళ్లింది. చుట్టుపక్కల వాళ్లు సమాచారం అందించడంతో పోలీసులు డెమీ మూర్ ఇంట్లోకి వెళ్లి యువకుడి శవాన్ని స్వాధీనం చేసుకున్నారు. విషయం తెలుసుకున్న డెమీ మూర్ షాకైంది. తన ఇంట్లో శవం ఉండడం షాక్ కు గురిచేసిందని చెప్పుకొచ్చింది. ఆ యువకుడి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించింది. ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. డెమీ మూర్ ఇంట్లో ఏమైనా ఆనవాళ్లు దొరుకుతాయేమో వెదికే పనిలో పడ్డారు. మరికొన్ని రోజుల్లో వాస్తవాలు బయటకొస్తాయి.
First Published:  20 July 2015 7:00 PM GMT
Next Story