Telugu Global
Others

వ్యాపం దర్యాప్తుకు మరో 200 మంది అవసరం: సీబీఐ

వ్యాపం స్కాం దర్యాప్తు వేగంగా జరగాలంటే మరో 200 మంది అధికారులు కావాలని ఈ కుంభకోణంపై దర్యాప్తుకు నాయకత్వం వహిస్తున్న సీబీఐ అధికారి చెప్పారు. విద్యార్థులను, వారి తల్లిదండ్రులను, మధ్యప్రదేశ్‌ ప్రభుత్వ అధికారులను… ఇలా దాదాపు 2000 మందిని విచారించాల్సి ఉన్నందున ప్రస్తుతం తమ వద్ద ఉన్న సిబ్బంది సరిపోరని, ఈవిషయాన్ని ఈ నెల 24న సుప్రీంకోర్టు విచారణ సందర్బంగా తెలపనున్నామని ఆయన చెప్పారు. ఇది చాలా పెద్ద స్కాం అని, ఇప్పటికే 40 మంది సీబీఐ […]

వ్యాపం స్కాం దర్యాప్తు వేగంగా జరగాలంటే మరో 200 మంది అధికారులు కావాలని ఈ కుంభకోణంపై దర్యాప్తుకు నాయకత్వం వహిస్తున్న సీబీఐ అధికారి చెప్పారు. విద్యార్థులను, వారి తల్లిదండ్రులను, మధ్యప్రదేశ్‌ ప్రభుత్వ అధికారులను… ఇలా దాదాపు 2000 మందిని విచారించాల్సి ఉన్నందున ప్రస్తుతం తమ వద్ద ఉన్న సిబ్బంది సరిపోరని, ఈవిషయాన్ని ఈ నెల 24న సుప్రీంకోర్టు విచారణ సందర్బంగా తెలపనున్నామని ఆయన చెప్పారు. ఇది చాలా పెద్ద స్కాం అని, ఇప్పటికే 40 మంది సీబీఐ అధికారులు ఈ దర్యాప్తులో నిమగ్నమై ఉన్నారని, వీరంతా ఇప్పటికే ఈ కేసుతో సంబంధముందన్న కారణంతో 185 ఎఫ్ఐఆర్‌లను పరిశీలించారని ఆయన తెలిపారు. అయితే 150 నుంచి 200 మంది సిబ్బంది ఈ స్కాం దర్యాప్తుకు అవసరమయినా అంతమంది సీబీఐ వద్ద లేరని, ఒకవేళ ఉన్న అందరినీ ఈ కేసుకు బదిలీ చేస్తే మిగిలిన కేసులన్నీ శోధించడం ఆపేయాల్సి వస్తుందని ఆయన అన్నారు. ఈ పరిస్థితిని సుప్రీంకోర్టుకు వివరించి బయటి ఏజన్సీల నుంచి సిబ్బందిని నియోగించాల్సిన అవసరాన్ని చెబుతామని, కోర్టు ఆదేశం తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు.
First Published:  19 July 2015 1:28 PM GMT
Next Story