Telugu Global
Others

ఇక‌పై ప్లాస్టిక్ జెండాలు ఉండ‌వు!

ప్ర‌తివిష‌యంలోనూ ప్లాస్టిక్ చొచ్చుకుపోతోంది. త‌క్కువ ధ‌ర‌కు ల‌భించ‌డం, వాడ‌కం సులువుగా ఉండ‌టంతో జాతీయ జెండాల్లోనూ దీని వాడ‌కం పెరిగింది. కానీ, అవి త్వ‌ర‌గా మ‌ట్టిలో క‌లిసిపోవు. దీంతో చెత్త‌బుట్ట‌ల్లో జాతీయ ప‌తాకాలు క‌నిపించ‌డం ప‌లువురిని బాధిస్తోంది. దీంతో అలాంటి ప్లాస్టిక్ జెండాల త‌యారీని నిషేదించాల‌ని కేంద్రం నిర్ణ‌యించింది. రిపబ్లిక్, స్వతంత్ర దినోత్సవం సందర్భంగా రహదారులు, కాలువలపై ప్లాస్టిక్‌తో తయారు చేసిన జెండాలు వేలాడుతూ కనిపిసున్నాయనే ఫిర్యాదులు తమ దృష్టికి వచ్చాయని, త్వరలోనే ప్లాస్టిక్ జాతీయ జెండాల తయారీ, […]

ప్ర‌తివిష‌యంలోనూ ప్లాస్టిక్ చొచ్చుకుపోతోంది. త‌క్కువ ధ‌ర‌కు ల‌భించ‌డం, వాడ‌కం సులువుగా ఉండ‌టంతో జాతీయ జెండాల్లోనూ దీని వాడ‌కం పెరిగింది. కానీ, అవి త్వ‌ర‌గా మ‌ట్టిలో క‌లిసిపోవు. దీంతో చెత్త‌బుట్ట‌ల్లో జాతీయ ప‌తాకాలు క‌నిపించ‌డం ప‌లువురిని బాధిస్తోంది. దీంతో అలాంటి ప్లాస్టిక్ జెండాల త‌యారీని నిషేదించాల‌ని కేంద్రం నిర్ణ‌యించింది. రిపబ్లిక్, స్వతంత్ర దినోత్సవం సందర్భంగా రహదారులు, కాలువలపై ప్లాస్టిక్‌తో తయారు చేసిన జెండాలు వేలాడుతూ కనిపిసున్నాయనే ఫిర్యాదులు తమ దృష్టికి వచ్చాయని, త్వరలోనే ప్లాస్టిక్ జాతీయ జెండాల తయారీ, ఉపయోగంపై నిషేధానికి ఉత్తర్వులు జారీ చేస్తామని కేంద్ర హోంశాఖకు చెందిన అధికారి తెలిపారు. ప్లాస్టిక్‌తో తయారు చేసే జాతీయ జెండాల వినియోగంపై నిషేధం, ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలను రూపొందించడం, పాఠ్యపుస్తకాలపై జాతీయ గీతం, ప్రతిజ్ఞను ముద్రించినట్లుగానే జాతీయజెండాను కూడా ముద్రించాలి అనే అంశాలపై సమగ్రమైన విధానాన్ని రూపొందించాలని కేంద్ర, మహారాష్ట్ర ప్రభుత్వాలను బాంబే హైకోర్టు గత మార్చిలో ఆదేశించిందన్న విషయాన్ని గుర్తు చేశారు.
First Published:  19 July 2015 1:13 PM GMT
Next Story