Telugu Global
Cinema & Entertainment

ఈరోజు నుంచి డిక్టేటర్ మొదలు

నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా డిక్టేటర్ ఈరోజు నుంచి ప్రారంభం అవుతుంది. ఈ సినిమా ఓపెనింగ్ చాలా రోజుల కిందటే జరిగింది. కానీ రెగ్యులర్ షూటింగ్ మాత్రం ప్రారంభం కాలేదు. హిందూపురం ఎమ్మెల్యేగా బిజీగా ఉన్న బాలయ్య, డిక్టేటర్ కు కాల్షీట్లు ఇవ్వడానికి ఇంత టైమ్ పట్టింది. మొత్తానికి ఈరోజు నుంచి రామానాయుడు స్టుడియోస్ లో డిక్టేటర్ సినిమా షూటింగ్ మొదలవుతుంది. స్టుడియోలో ఇప్పటికే వేసిన భారీ సెట్ లో బాలకృష్ణతో కొన్ని కీలక సన్నివేశాలు తీయబోతున్నారు. […]

ఈరోజు నుంచి డిక్టేటర్ మొదలు
X
నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా డిక్టేటర్ ఈరోజు నుంచి ప్రారంభం అవుతుంది. ఈ సినిమా ఓపెనింగ్ చాలా రోజుల కిందటే జరిగింది. కానీ రెగ్యులర్ షూటింగ్ మాత్రం ప్రారంభం కాలేదు. హిందూపురం ఎమ్మెల్యేగా బిజీగా ఉన్న బాలయ్య, డిక్టేటర్ కు కాల్షీట్లు ఇవ్వడానికి ఇంత టైమ్ పట్టింది. మొత్తానికి ఈరోజు నుంచి రామానాయుడు స్టుడియోస్ లో డిక్టేటర్ సినిమా షూటింగ్ మొదలవుతుంది. స్టుడియోలో ఇప్పటికే వేసిన భారీ సెట్ లో బాలకృష్ణతో కొన్ని కీలక సన్నివేశాలు తీయబోతున్నారు. శ్రీవాస్ డైరక్ట్ చేయబోతున్న ఈ సినిమాలో బాలయ్య సరసన తొలిసారిగా అంజలి హీరోయిన్ గా నటిస్తోంది. రామానాయుడు స్టుడియోస్ లో షెడ్యూల్ పూర్తయిన వెంటనే సినిమా యూనిట్ యూరోప్ వెళ్తుంది. బాలయ్య-అంజలి కలిసి యూరోప్ లోని అందమైన లొకేషన్లలో సాంగ్ షూట్ చేస్తారు. బాలయ్యతో లెజండ్ సినిమా చేసిన సోనాల్ చౌహాన్ కూడా డిక్టేటర్ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీకోసం బల్క్ లో కాల్షీట్లు కేటాయించాడు బాలయ్య. ఏకథాటిగా సినిమాను పూర్తిచేయాలని ఫిక్స్ అయ్యాడు. బాలయ్యకు ఇది 99వ చిత్రం. ఈ సినిమా పూర్తయిన తర్వాత కొంత గ్యాప్ తీసుకొని వందో సినిమాను పట్టాలపైకి తీసుకురావాలనుకుంటున్నాడు బాలకృష్ణ.
First Published:  19 July 2015 10:00 PM GMT
Next Story