Telugu Global
Cinema & Entertainment

 ఆ సినిమా నేను చేయాల్సింది- అమీర్

సల్మాన్ నటించిన భజరంగీ భాయ్ జాన్ సినిమాను చాలామంది ప్రముఖులు చూసి మెచ్చుకున్నారు. ప్రేక్షకులు ఆ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. కానీ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ మాత్రం సినిమా చూసి చాలా బాధపడుతున్నాడు. అరెరె.. ఈ సినిమా నేను చేసుంటే బాగుండేదే అని తెగ మథనపడుతున్నాడు. తాజాగా సల్మాన్ నటించిన భజరంగీ భాయ్ జాన్ సినిమాను చూశాడు అమీర్ ఖాన్. రంజాన్ స్పెషల్ గా కుటుంబ సభ్యులందరితో కలిసి సినిమాను ఎంజాయ్ చేశాడు. సినిమా చూసిన […]

 ఆ సినిమా నేను చేయాల్సింది- అమీర్
X
సల్మాన్ నటించిన భజరంగీ భాయ్ జాన్ సినిమాను చాలామంది ప్రముఖులు చూసి మెచ్చుకున్నారు. ప్రేక్షకులు ఆ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. కానీ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ మాత్రం సినిమా చూసి చాలా బాధపడుతున్నాడు. అరెరె.. ఈ సినిమా నేను చేసుంటే బాగుండేదే అని తెగ మథనపడుతున్నాడు. తాజాగా సల్మాన్ నటించిన భజరంగీ భాయ్ జాన్ సినిమాను చూశాడు అమీర్ ఖాన్. రంజాన్ స్పెషల్ గా కుటుంబ సభ్యులందరితో కలిసి సినిమాను ఎంజాయ్ చేశాడు. సినిమా చూసిన వెంటనే ఆ మూవీని తను చేసుకుంటే బాగుండేదని తెగ బాధపడ్డాడు. తర్వాత సల్మాన్ అద్భుతంగా నటించాడంటూ మెచ్చుకున్నాడు. సల్మాన్ కెరీర్ లోనే ఇప్పటివరకు ది బెస్ట్ యాక్టింగ్ ఇందులోనే కనిపించిందని పొగిడాడు. దర్శకుడ కబీర్ ఖాన్, హీరో సల్మాన్ కలిసి నిజంగా వెరీ వెరీ స్పెషల్ ఫిలిం తీశారంటూ మనసారా మెచ్చుకున్నాడు. నిజానికి ఈ సినిమా ఆఫర్ మొదట అమీర్ ఖాన్ కే వచ్చింది. అయితే అప్పటికే ఓ రెండు సినిమాలకు అమీర్ కమిట్ అవ్వడంతో ఈ సినిమాను మిస్ చేసుకున్నాడు.
First Published:  19 July 2015 7:31 PM GMT
Next Story