Telugu Global
Others

అప్పుల్లో ఎయిర్ ఇండియా ...  అమ్మ‌కానికి ఆస్తులు 

పీక‌ల్లోతు అప్పుల్లో కూరుకు పోయిన ప్ర‌భుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా  అప్పుల‌ను తీర్చుకోవ‌డానికి  సంస్థ ఆస్తుల‌ను అమ్మాల‌ని నిర్ణ‌యించింది. ఎయిర్ ఇండియాకు ముంబై, చెన్నై, కోయంబ‌త్తూరులో కోట్లాది రూపాయ‌లు  విలువ చేసే  స్థలాలను విక్ర‌యించేందుకు  కేబినెట్ నోట్ సిద్ధ‌మైంద‌ని ఉన్న‌తాధికారులు వెల్ల‌డించారు. ఎయిర్ ఇండియాకు రూ. 40 వేల కోట్ల రూపాయ‌లు అప్పులుండ‌గా, సంస్థ‌కు రూ. 2,400 కోట్ల రూపాయ‌ల బ‌కాయిలు రావ‌ల్సి ఉంది. ఇందులో వీవీఐపీ ప్ర‌యాణికుల బాకీనే రూ. 600 కోట్లు […]

అప్పుల్లో ఎయిర్ ఇండియా ...  అమ్మ‌కానికి ఆస్తులు 
X
పీక‌ల్లోతు అప్పుల్లో కూరుకు పోయిన ప్ర‌భుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా అప్పుల‌ను తీర్చుకోవ‌డానికి సంస్థ ఆస్తుల‌ను అమ్మాల‌ని నిర్ణ‌యించింది. ఎయిర్ ఇండియాకు ముంబై, చెన్నై, కోయంబ‌త్తూరులో కోట్లాది రూపాయ‌లు విలువ చేసే స్థలాలను విక్ర‌యించేందుకు కేబినెట్ నోట్ సిద్ధ‌మైంద‌ని ఉన్న‌తాధికారులు వెల్ల‌డించారు. ఎయిర్ ఇండియాకు రూ. 40 వేల కోట్ల రూపాయ‌లు అప్పులుండ‌గా, సంస్థ‌కు రూ. 2,400 కోట్ల రూపాయ‌ల బ‌కాయిలు రావ‌ల్సి ఉంది. ఇందులో వీవీఐపీ ప్ర‌యాణికుల బాకీనే రూ. 600 కోట్లు ఉన్న‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. ఆస్తుల విక్ర‌యం ద్వారా సుమారు రూ. 250 కోట్ల‌ను స‌మ‌కూర్చుకోవాల‌ని, మిగిలిన రూ. 1,800 వేల కోట్ల రూపాయ‌ల‌ను కేంద్రం నుంచి గ్రాంట్‌గా పొందాల‌ని సంస్థ భావిస్తోంది. పార్ల‌మెంటు వ‌ర్షాకాల స‌మావేశాల్లో ఈ అంశాన్ని ప్ర‌స్తావించే అవ‌కాశం ఉంది.
Next Story