Telugu Global
Others

త్వ‌ర‌లో ఆన్‌లైన్ పోస్ట‌ల్ స‌ర్వీస్‌లు 

సెల్‌ఫోన్లు, ఇంట‌ర్నెట్‌లు వ‌చ్చిన త‌ర్వాత పోస్ట‌ల్ డిపార్ట‌మెంటుకు ప‌ని భారం త‌గ్గింది. కొన్ని ద‌శాబ్దాలుగా ప్ర‌జ‌ల‌కు సేవ చేసిన టెలిగ్రాం వంటి అత్య‌వ‌స‌ర సేవ‌లు కూడా  నిరాద‌ర‌ణ‌కు గుర‌వ‌డంతో ఇటీవ‌ల కాలంలో ర‌ద్ద‌య్యాయి. దీంతో త‌పాలా శాఖ‌కు ఆదాయ వ‌న‌రులు కూడా త‌గ్గాయి.  అయితే, ఆధునిక సాంకేతిక విజ్ఞానం ద్వారా తిరిగి మార్కెట్లో పూర్వ వైభ‌వాన్ని పుంజుకోవాల‌ని త‌పాలా శాఖ ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది.  ఉత్తరాల బ‌ట్వాడాకు కొన్ని రోజుల స‌మ‌యాన్ని తీసుకునే పోస్ట‌ల్ శాఖ ఇప్పుడు ఆ […]

సెల్‌ఫోన్లు, ఇంట‌ర్నెట్‌లు వ‌చ్చిన త‌ర్వాత పోస్ట‌ల్ డిపార్ట‌మెంటుకు ప‌ని భారం త‌గ్గింది. కొన్ని ద‌శాబ్దాలుగా ప్ర‌జ‌ల‌కు సేవ చేసిన టెలిగ్రాం వంటి అత్య‌వ‌స‌ర సేవ‌లు కూడా నిరాద‌ర‌ణ‌కు గుర‌వ‌డంతో ఇటీవ‌ల కాలంలో ర‌ద్ద‌య్యాయి. దీంతో త‌పాలా శాఖ‌కు ఆదాయ వ‌న‌రులు కూడా త‌గ్గాయి. అయితే, ఆధునిక సాంకేతిక విజ్ఞానం ద్వారా తిరిగి మార్కెట్లో పూర్వ వైభ‌వాన్ని పుంజుకోవాల‌ని త‌పాలా శాఖ ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది. ఉత్తరాల బ‌ట్వాడాకు కొన్ని రోజుల స‌మ‌యాన్ని తీసుకునే పోస్ట‌ల్ శాఖ ఇప్పుడు ఆ పాత విధానానికి స్వ‌స్తి చెప్పాల‌ని భావిస్తోంది. శుభాకాంక్ష‌లు, క్షేమ స‌మాచారం, ఉద్యోగ వివ‌రాలు, శుభ‌కార్యాల‌కు ఆహ్వానాల వంటి వాటిని కొన్ని గంట‌ల్లోనే గ‌మ్యం చేర్చాల‌ని, అది కూడా మ‌నం కోరిన డిజైన్‌లోనే వాటిని త‌యారు చేయాల‌ని భావిస్తోంది. అందుకోసం ఆన్‌లైన్ సేవ‌లు ప్రారంభించ‌నుంది. వినియోగ‌దారుడు కోరిన విధంగా రూపొందించిన బ‌హుమతులను ఆన్‌లైన్ ద్వారా ఆయా పోస్టాఫీసుల‌కు పంపి అక్క‌డ నుంచి కొన్ని గంట‌ల్లోనే బ‌ట్వాడా చేస్తారు. అంతేకాకుండా స‌రుకు ర‌వాణా, కొరియ‌ర్ స‌ర్వీసులు, బ్యాంకింగ్‌సేవ‌లు, పుస్త‌కాలు, మందులు బ‌ట్వాడా వంటి సేవ‌ల‌ను కూడా త్వ‌ర‌లో ప్రారంభించాల‌ని పోస్ట‌ల్ శాఖ నిర్ణ‌యించింది.

First Published:  18 July 2015 1:10 PM GMT
Next Story