Telugu Global
Others

ర‌ద్దీ నియంత్ర‌ణలో.. హ‌రీష్, ఈట‌ల‌

తెలంగాణ భారీనీటిపారుద‌ల మంత్రి, ఆర్థిక మంత్రి కొత్త అవ‌తారం ఎత్తారు. శ‌నివారం క‌రీంన‌గ‌ర్‌- ధ‌ర్మ‌పురి ప్ర‌ధాన ర‌హ‌దారిలో ఏర్ప‌డ్డ ట్రాఫిక్ జామ్‌ను క్లియ‌ర్ చేసే ప‌నిలో ప‌డ్డారు. వారిద్ద‌రూ బుల్లెట్ వాహ‌నాల‌పై తిరుగుతూ స్వ‌యంగా ట్రాఫిక్ ర‌ద్దీని నియంత్రించ‌డం విశేషం. మంత్రి ఈట‌ల‌, హ‌రీష్ రావు ఒక బైకుపై, మ‌రోబైకుపై ఎమ్మెల్యే గంగుల క‌మ‌లాక‌ర్  రోజంతా ఈ దారిలో ట్రాఫిక్‌ను ప‌ర్య‌వేక్షించారు. వ‌రుస సెల‌వులు రావ‌డంతో పుష్క‌ర స్నానాల‌కు భ‌క్తులు పోటెత్తారు.  జిల్లాలు, రాజ‌ధాని నుంచి ల‌క్ష‌ల […]

తెలంగాణ భారీనీటిపారుద‌ల మంత్రి, ఆర్థిక మంత్రి కొత్త అవ‌తారం ఎత్తారు. శ‌నివారం క‌రీంన‌గ‌ర్‌- ధ‌ర్మ‌పురి ప్ర‌ధాన ర‌హ‌దారిలో ఏర్ప‌డ్డ ట్రాఫిక్ జామ్‌ను క్లియ‌ర్ చేసే ప‌నిలో ప‌డ్డారు. వారిద్ద‌రూ బుల్లెట్ వాహ‌నాల‌పై తిరుగుతూ స్వ‌యంగా ట్రాఫిక్ ర‌ద్దీని నియంత్రించ‌డం విశేషం. మంత్రి ఈట‌ల‌, హ‌రీష్ రావు ఒక బైకుపై, మ‌రోబైకుపై ఎమ్మెల్యే గంగుల క‌మ‌లాక‌ర్ రోజంతా ఈ దారిలో ట్రాఫిక్‌ను ప‌ర్య‌వేక్షించారు. వ‌రుస సెల‌వులు రావ‌డంతో పుష్క‌ర స్నానాల‌కు భ‌క్తులు పోటెత్తారు. జిల్లాలు, రాజ‌ధాని నుంచి ల‌క్ష‌ల సంఖ్య‌లో ధ‌ర్మ‌పురి, బాస‌ర‌, కాళేశ్వ‌రం, భ‌ద్రాచ‌లం వైపు సాగారు. వారాంతం కావ‌డం, రాజ‌ధాని నుంచి స‌మీపంలో ఉండ‌టంతో ఆయా పుష్క‌ర ఘాట్ల‌కు భ‌క్తుల ర‌ద్దీ పెరిగింది. హైద‌రాబాద్‌కు అత్యంత స‌మీపంలో ఉన్న పుష్క‌ర‌ఘాట్ ధ‌ర్మ‌పురి. దీని దూరం రాజ‌ధాని నుంచి కేవ‌లం 230 కి.మీ. దీంతో న‌గ‌రం నుంచి సొంత‌వాహ‌నాల్లో భ‌క్తులు ధ‌ర్మ‌పురి బాట ప‌ట్టారు. ఫ‌లితంగా ఈదారిలో మునుపెన్న‌డూ చూడ‌ని జ‌నం ఈ దారిలో రావ‌డంతో స్థానికులు సైతం ఆశ్చ‌ర్య‌పోయారు. ట్రాఫిక్‌జామ్‌లో ఇరుక్కున్న భ‌క్తుల‌కు స్థానిక గ్రామాల ప్ర‌జ‌లు తాగునీరు, వ‌స‌తి క‌ల్పించారు.
First Published:  18 July 2015 1:05 PM GMT
Next Story