Telugu Global
Others

భార‌త్‌ ప్రాజెక్టుల కోసం అర్రులు చాస్తున్న అమెరికా సంస్థ‌

భార‌త్‌లో రెండు నీటి ప‌థ‌కాల కాంట్రాక్ట్ కోసం ముడుపులు చెల్లించిన లూయిస్ బెర్గ‌ర్ అనే అమెరికాకు చెందిన నిర్మాణ సంస్థ‌పై  న్యూజెర్సీ ఫెడ‌ర‌ల్ కోర్టు అభియోగాలు  న‌మోదు చేసింది.  గోవా, గుహ‌వాటిక‌ల్లో నిర్మించ‌నున్న ఈ ప్ర‌ధాన నీటి ప్రాజెక్టుల కోసం ఆ కంపెనీ  ఓ మంత్రికి రూ . 6.15 కోట్ల‌ను, అధికారులు భారీగా లంచాలు చెల్లించింద‌ని ప్రాసిక్యూష‌న్ వెల్ల‌డించింది.  ఆ కంపెనీ భార‌త్ స‌హా మ‌రో నాలుగు దేశాల్లో ఈ కంపెనీ ముడుపులు చెల్లించింద‌ని ప్రాసిక్యూష‌న్ […]

భార‌త్‌లో రెండు నీటి ప‌థ‌కాల కాంట్రాక్ట్ కోసం ముడుపులు చెల్లించిన లూయిస్ బెర్గ‌ర్ అనే అమెరికాకు చెందిన నిర్మాణ సంస్థ‌పై న్యూజెర్సీ ఫెడ‌ర‌ల్ కోర్టు అభియోగాలు న‌మోదు చేసింది. గోవా, గుహ‌వాటిక‌ల్లో నిర్మించ‌నున్న ఈ ప్ర‌ధాన నీటి ప్రాజెక్టుల కోసం ఆ కంపెనీ ఓ మంత్రికి రూ . 6.15 కోట్ల‌ను, అధికారులు భారీగా లంచాలు చెల్లించింద‌ని ప్రాసిక్యూష‌న్ వెల్ల‌డించింది. ఆ కంపెనీ భార‌త్ స‌హా మ‌రో నాలుగు దేశాల్లో ఈ కంపెనీ ముడుపులు చెల్లించింద‌ని ప్రాసిక్యూష‌న్ ఆరోపించింది. ఆ అభియోగాల‌ను ప‌రిష్క‌రించేందుకు 17.1 మిలియ‌న్ డాల‌ర్ల‌ను చెల్లించేందుకు ఆ కంపెనీ శుక్ర‌వారం అంగీక‌రించింది.లూయిస్ సంస్థ 1998లో భార‌త్‌లోకార్య‌క‌లాపాల‌ను ప్రారంభించింది. త‌క్కువ స‌మ‌యంలో ప్రాజెక్టులు పొందాల‌న్న ఉద్దేశ్యంతో భార‌త్‌లోని రాజ‌కీయ వేత్త‌ల‌కు , అధికారుల‌కు భారీగా లంచాలు ముట్ట‌జెప్పింద‌ని ప్రాసిక్యూష‌న్ వాద‌న‌లు వినిపించింది.​

First Published:  18 July 2015 1:12 PM GMT
Next Story