Telugu Global
Others

డ్రోన్‌లతో పుష్కర ప్రాంతాలపై కన్ను!

ఆధునిక టెక్నాలజీని తెలుగు రాష్ట్రాలు గోదావరి పుష్కరాల సందర్భంగా అద్భుతంగా వినియోగించుకుంటున్నాయి. తొలిరోజు జరిగిన దుర్ఘటనను మినహాయిస్తే ఆ తర్వాత అధికారులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించి పోవడం, ఒక్కో పుష్కర ఘాట్‌లో ఒక్కో రీతిగా జనం ఉండడం… రైళ్ళు, బస్సుల్లో వచ్చే ప్రయాణికులు ఎంతమంది ఒకేసారి ఆయా ప్రాంతాలకు చేరుతున్నారనే సమాచారాన్ని ఆధునిక డ్రోన్ కెమెరాల ద్వారానే ఎక్కువగా సేకరించి చర్యలు తీసుకుంటున్నారు. ఈ కెమెరాలను రాజమండ్రిలో […]

డ్రోన్‌లతో పుష్కర ప్రాంతాలపై కన్ను!
X
ఆధునిక టెక్నాలజీని తెలుగు రాష్ట్రాలు గోదావరి పుష్కరాల సందర్భంగా అద్భుతంగా వినియోగించుకుంటున్నాయి. తొలిరోజు జరిగిన దుర్ఘటనను మినహాయిస్తే ఆ తర్వాత అధికారులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించి పోవడం, ఒక్కో పుష్కర ఘాట్‌లో ఒక్కో రీతిగా జనం ఉండడం… రైళ్ళు, బస్సుల్లో వచ్చే ప్రయాణికులు ఎంతమంది ఒకేసారి ఆయా ప్రాంతాలకు చేరుతున్నారనే సమాచారాన్ని ఆధునిక డ్రోన్ కెమెరాల ద్వారానే ఎక్కువగా సేకరించి చర్యలు తీసుకుంటున్నారు. ఈ కెమెరాలను రాజమండ్రిలో రెండు, కొవ్వూరులో ఒకటి, భద్రాచలంలో మరొకటి ఉపయోగించి పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. డ్రోన్ కెమెరాల సాయంతో అధికారులు ట్రాఫిక్‌ను క్రమబద్దీకరిస్తున్నారు. రద్దీ లేని పుష్కర ఘాట్‌లకు భక్తులను పంపేందుకు కూడా ఇవి ఇచ్చే సమాచారాన్ని ఉపయోగించుకుంటున్నారు.
First Published:  18 July 2015 1:40 AM GMT
Next Story