Telugu Global
Others

యాక్ట‌ర్‌తో ఫొటో... ఐపీఎస్‌కు చిక్కులు 

సినిమా యాక్ట‌ర్‌పై ఉన్న అభిమానం  ఆ పోలీస్ అధికారికి చిక్కులు తెచ్చిపెట్టింది. కేర‌ళ‌లోని తిరువ‌నంత‌పురంలో అసిస్టెంట్ క‌మిష‌న‌ర్‌గా ప‌ని చేస్తున్న మెరిన్ జోసెఫ్  సౌతిండియా స్టార్ నివిన్ పౌలీతో ఫొటోలు తీసుకుని వాటిని ఫేస్‌బుక్‌లో పెట్టారు. పోలీస్ యూనిఫాంలో మెరిన్, ప‌క్క‌నే సినీ హీరో పౌలీ  ఫొటోకు నెటిజ‌న్లు పెద్ద సంఖ్య‌లో లైక్‌లు కొట్టారు. అయితే, ఈ ఫొటోపై మీడియాలో పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు చెల‌రేగాయి. మెరిన్ ప్రొటోకాల్ ఉల్లంఘించి, సినీ యాక్ట‌ర్‌తో ఫొటోలు దిగార‌ని విమ‌ర్శ‌లు […]

సినిమా యాక్ట‌ర్‌పై ఉన్న అభిమానం ఆ పోలీస్ అధికారికి చిక్కులు తెచ్చిపెట్టింది. కేర‌ళ‌లోని తిరువ‌నంత‌పురంలో అసిస్టెంట్ క‌మిష‌న‌ర్‌గా ప‌ని చేస్తున్న మెరిన్ జోసెఫ్ సౌతిండియా స్టార్ నివిన్ పౌలీతో ఫొటోలు తీసుకుని వాటిని ఫేస్‌బుక్‌లో పెట్టారు. పోలీస్ యూనిఫాంలో మెరిన్, ప‌క్క‌నే సినీ హీరో పౌలీ ఫొటోకు నెటిజ‌న్లు పెద్ద సంఖ్య‌లో లైక్‌లు కొట్టారు. అయితే, ఈ ఫొటోపై మీడియాలో పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు చెల‌రేగాయి. మెరిన్ ప్రొటోకాల్ ఉల్లంఘించి, సినీ యాక్ట‌ర్‌తో ఫొటోలు దిగార‌ని విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అయితే, మీడియా విమ‌ర్శ‌ల‌కు ఆమె ఘాటుగా స్పందించారు. ఎర్నాకుళంలో జ‌రిగిన ఓ కాలేజ్ ఫంక్ష‌న్‌లో త‌న విధి నిర్వ‌హ‌ణ పూర్త‌యిన త‌ర్వాత‌నే పౌలీతో ఫొటోలు తీసుకున్నాన‌ని ఆమె వివ‌రించారు. మీడియా ప‌ట్టించుకోవాల్సిన విష‌యాలు చాలా ఉన్నాయ‌ని, ఆ స‌మ‌స్య‌ల‌పై దృష్టి పెట్టాల‌ని ఆమె మీడియాకు సూచించారు.
First Published:  17 July 2015 1:08 PM GMT
Next Story