Telugu Global
Others

ఈ నెల 24లోగా కాల్‌ డేటా ఇవ్వాల్సిందే: కోర్టు ఆదేశం

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సర్వీస్‌ ప్రొవైడర్లు కాల్‌ డేటాను ఇవ్వాల్సిందేనని, పది రోజుల క్రితం దీనిపై ఆదేశాలు జారీ చేసినప్పటికీ స్పందించక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 24వ తేదీలోపు సీల్డ్‌ కవర్‌లో కాల్‌డేటాను సమర్పించాలని మరోసారి ఆదేశించింది. దీంతో ఈకేసు కీలక మలుపు తిరిగింది. ట్యాపింగ్‌ కేసుకు సంబంధించి సిట్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విజయవాడ చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు న్యాయమూర్తి వి. శ్రీనివాసరావు విచారణ జరిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున […]

ఈ నెల 24లోగా కాల్‌ డేటా ఇవ్వాల్సిందే: కోర్టు ఆదేశం
X
ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సర్వీస్‌ ప్రొవైడర్లు కాల్‌ డేటాను ఇవ్వాల్సిందేనని, పది రోజుల క్రితం దీనిపై ఆదేశాలు జారీ చేసినప్పటికీ స్పందించక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 24వ తేదీలోపు సీల్డ్‌ కవర్‌లో కాల్‌డేటాను సమర్పించాలని మరోసారి ఆదేశించింది. దీంతో ఈకేసు కీలక మలుపు తిరిగింది. ట్యాపింగ్‌ కేసుకు సంబంధించి సిట్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విజయవాడ చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు న్యాయమూర్తి వి. శ్రీనివాసరావు విచారణ జరిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ కె. వేణుగోపాలరావుతోపాటు మరో ఇద్దరు, సర్వీస్‌ ప్రొవైడర్ల తరఫున నలుగురు న్యాయవాదులు వాదించారు. కాల్‌డేటా సమర్పించాలని ఈ నెల 7న కోర్టు ఇచ్చిన తీర్పు కాపీ తాము తీసుకోలేదని, విచారణ మరో రెండువారాలు వాయిదా వేయాలని కోరారు. ఇరు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తాము నలిగిపోతున్నామని వారు అన్నారు. అలాగే ఇది రెండు రాష్ట్రాలకు సంబంధించిన సమస్య కాబట్టి ఒక రాష్ట్రం ఇచ్చిన ఉత్తర్వులను మరో రాష్ట్రానికి ఇవ్వలేమని చెప్పారు. ఇది రహస్య సమాచారం కాబట్టి ఇతరులకు ఇస్తే 123 క్రిమినల్‌ యాక్ట్‌ కింద కేసులు పెడతామని తెలంగాణ ప్రభుత్వం హెచ్చరించిందని వారు కోర్టుకు తెలిపారు. పైగా కేంద్ర ప్రభుత్వం ఫోన్‌ ట్యాపింగ్‌పై రెండు ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. పరిస్థితి ఇలా ఉందని వివరిస్తూ… ‘‘మీరు గత ఆదేశాలకు సంబంధించిన కాపీ అప్లికేషన్‌ ఇస్తే… దీనిపై రెండు రాష్ట్రాలకు ఉమ్మడిగా ఉన్న హైకోర్టుకు కానీ, ఇంకా పైకోర్టుకు కానీ వెళతాం’’ అని తెలిపారు. అయితే… తీర్పు వెలువడిన పది రోజులైనా సదరు ఆదేశాల కాపీ తీసుకోకపోవడం మీ తప్పేనని సర్వీస్‌ ప్రొవైడర్లతో న్యాయమూర్తి అన్నారు. ఒకవేళ ట్యాపింగ్‌ చేయమని తెలంగాణ ప్రభుత్వం మిమ్మల్ని కోరి ఉండకపోతే ఆ విషయాన్ని లిఖిత పూర్వకంగా కోర్టుకు అందజేయాలని సూచించారు. దీనిపై వారు మౌనం వహించారు. సర్వీస్‌ ప్రొవైడర్ల వాదనలను అడ్వొకేట్‌ జనరల్‌ వేణుగోపాలరావు తిప్పికొట్టారు. కోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకునే హక్కు ఏ ప్రభుత్వానికీ లేదని అంటూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది కేవలం మెమో మాత్రమేనని తెలిపారు. ప్రభుత్వాలు ఇచ్చే పాలనాపరమైన ఉత్తర్వులు కోర్టు తీర్పులను నిర్దేశించలేవన్నారు. సుమారు గంటసేపు వాద ప్రతివాదనలు విన్న తర్వాత సాయంత్రం 6 గంటలకు న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. సిట్‌ సమర్పించిన 25 ఫోన్‌ నంబర్లకు సంబంధించిన కాల్‌ డేటా రికార్డ్‌ల (సీడీఆర్‌)ను 24వ తేదీలోపు సీల్డ్‌ కవర్‌లో సమర్పించాలని ఆదేశించారు. కోర్టు ఇచ్చిన ఆదేశాలను సర్వీసు ప్రొవైడర్లు ఉల్లంఘించినందున… చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున ఆ రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ ఐజీ, కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ ఐజీ, స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో అధికారులు… ఇచ్చిన లేఖలను కోర్టుకు అందచేయాలని ఆదేశించారు.
First Published:  17 July 2015 9:09 PM GMT
Next Story