Telugu Global
Family

పశ్చాత్తాపం (Devotional)

ఒక లోభి కాకికి చెయ్యి విదిలించనివాడు. కడుపుకు తినకుండా నానాకష్టాలు పడి డబ్బును బాగా కూడ బెట్టాడు. ఈ సంవత్సరమంతా కూడబెట్టి వచ్చే సంవత్సరం సుఖపడతానని అనుకునేవాడు. వచ్చే సంవత్సరం కూడా అలాగే అనుకునేవాడు. సంపాదించింది అతని అనుభవానికి రాకుండానే పోయింది. ఒకరోజు దేవదూత హఠాత్తుగా ప్రత్యక్షమైంది. ఆ దేవదూత మృత్యువుకు ప్రతినిధి. అతన్ని తీసుకుపోవడానికి వచ్చింది. లోభి దేవదూతతో వాదానికి దిగి తను జీవించి ఉండడానికి అనుమతించాల్సిందిగా కోరాడు. దేవదూత కుదరదని అతన్ని లాగడం మొదలు […]

ఒక లోభి కాకికి చెయ్యి విదిలించనివాడు. కడుపుకు తినకుండా నానాకష్టాలు పడి డబ్బును బాగా కూడ బెట్టాడు. ఈ సంవత్సరమంతా కూడబెట్టి వచ్చే సంవత్సరం సుఖపడతానని అనుకునేవాడు. వచ్చే సంవత్సరం కూడా అలాగే అనుకునేవాడు. సంపాదించింది అతని అనుభవానికి రాకుండానే పోయింది.

ఒకరోజు దేవదూత హఠాత్తుగా ప్రత్యక్షమైంది. ఆ దేవదూత మృత్యువుకు ప్రతినిధి. అతన్ని తీసుకుపోవడానికి వచ్చింది.

లోభి దేవదూతతో వాదానికి దిగి తను జీవించి ఉండడానికి అనుమతించాల్సిందిగా కోరాడు. దేవదూత కుదరదని అతన్ని లాగడం మొదలు పెట్టింది. లోభి కాళ్ళ బేరానికి దిగాడు. “దయచేసి ఇంకొన్నాళ్ళు భూమిపై ఉండడానికి అవకాశమివ్వు. నాకున్న సంపదలో మూడో వంతు ఇస్తాను” అన్నాడు. దేవదూత కుదరదంది. దానికి లోభి “కనీసం కొన్నిరోజులు అనుమతించు. నేను తీరని కోరికల్తో ఉన్నాను. నా ఆస్తిలో సగం నీకిస్తాను” అన్నాడు.

దేవదూత “ఇది దైవసంకల్పం, వీలుకాదు” అంది.

లోభి “కనీసం ఒక ఉత్తరం నా సన్నిహితులయిన వాళ్ళకోసం రాయాలి. అది రాసేదాకా నన్ను ప్రాణంతో ఉండనివ్వు” అని బతిమాలాడాడు. దేవదూత సరేనంది.

అప్పుడు ఆ లోభి తన రక్తంతో ఒక ఉత్తరం రాశాడు. అందులో

“ప్రియమయిన ఆత్మీయులారా!

మీరు నాలాగా జీవించకండి. నా జీవితమంతా శ్రమపడి ఎంతో సంపదను కూడ బెట్టాను. ఎప్పుడూ సుఖపడి ఎరగను. నేను జీవితానికికాక సంపదకు విలువనిచ్చాను. ఆ సంపదను అనుభవించి ఎరగను. నా సంపదతో ఒక్క ఆనంద క్షణాన్ని కూడా అందుకోలేకపోయాను. మీరు జీవితానికి విలువనియ్యండి. జీవించడానికి విలువనియ్యండి” అని రాశాడు.

– సౌభాగ్య

First Published:  17 July 2015 1:01 PM GMT
Next Story