Telugu Global
NEWS

కాంగ్రెస్ నేతల టీ-స‌చివాల‌యం ముట్ట‌డి

మున్సిప‌ల్ కార్మికుల వేత‌నాలు పెంచాల‌ని డిమాండు చేస్తూ కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని రాజకీయ పక్షాలూ రాష్ట్ర వ్వాప్త బంద్‌కు పిలుపు ఇస్తే తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు మెరుపు ధ‌ర్నాకు దిగారు. సీనియ‌ర్ నేత‌లంతా క‌లిసి టి-స‌చివాల‌యాన్ని ముట్ట‌డించే ప్ర‌య‌త్నం చేశారు. అనుకోని ఈ సంఘటనకు ఖంగు తిన్న పోలీసులు ధర్నాలో పాల్గొన్న నాయకులను అరెస్ట్ చేసి గాంధీనగర్‌ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వీరి ఆందోళ‌న‌కు అడ్డుకట్ట వేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ధ‌ర్నాలు పాల్గొన్న వారంతా […]

కాంగ్రెస్ నేతల టీ-స‌చివాల‌యం ముట్ట‌డి
X
మున్సిప‌ల్ కార్మికుల వేత‌నాలు పెంచాల‌ని డిమాండు చేస్తూ కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని రాజకీయ పక్షాలూ రాష్ట్ర వ్వాప్త బంద్‌కు పిలుపు ఇస్తే తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు మెరుపు ధ‌ర్నాకు దిగారు. సీనియ‌ర్ నేత‌లంతా క‌లిసి టి-స‌చివాల‌యాన్ని ముట్ట‌డించే ప్ర‌య‌త్నం చేశారు. అనుకోని ఈ సంఘటనకు ఖంగు తిన్న పోలీసులు ధర్నాలో పాల్గొన్న నాయకులను అరెస్ట్ చేసి గాంధీనగర్‌ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వీరి ఆందోళ‌న‌కు అడ్డుకట్ట వేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ధ‌ర్నాలు పాల్గొన్న వారంతా తెలంగాణ ద్రోహి కేసీఆర్ డౌన్‌, డౌన్ అంటూ నినాదాలు చేశారు. ధ‌ర్నాలో టీ-పీసీసీ నేత ఉత్త‌మ్ కుమార్‌రెడ్డి, విధానసభలో ప్రతిపక్షనేత జానారెడ్డి, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భ‌ట్టి విక్రమార్క, దానం నాగేందర్‌, ష‌బ్బీర్ అలీ, వి.హనుమంతరావు, అంజ‌న్ కుమార్ యాదవ్ పాల్గొని సమ్మె చేస్తున్న జీహెచ్‌ఎంసీ కార్మికులకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా వి.హెచ్. మాట్లాడుతూ సఫాయి కార్మికుల్లో ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందినవారని, వారంతా పేద, బీద, బలహీనవర్గాలకు చెందిన వారని, వీరంతా కడుపు నిండా తినగలిగినప్పుడే బంగారు తెలంగాణ సాకారమయినట్టని అన్నారు. ష‌బ్బీర్ న‌ల‌భై వేల మంది స‌ఫాయి కార్మికులు ప‌ది రోజులుగా ఆందోళ‌న చేస్తుంటే… గ‌రీబోళ్ళ డిమాండును నెర‌వేర్చ‌డానికి ఈ తెలంగాణ ప్రభుత్వం వద్ద పైస‌లు లేవా అని ప్ర‌శ్నించారు. ఎన్నికల ముందు పారిశుధ్య కార్మికులే దేవుళ్ళన్న కేసీఆర్ ఇపుడు వారిని గాలికొదిలేసి రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. దానం నాగేందర్ మాట్లాడుతూ పారిశుద్య కార్మికుల బతుకులతో రాజకీయాలు చేయడం మానేసి ఇప్ప‌టికైనా ప్ర‌భుత్వం క‌ళ్ళు తెర‌వాల‌ని, వారి న్యాయ‌మైన డిమాండ్ల‌ను వెంట‌నే నెర‌వేర్చాల‌ని డిమాండు చేశారు.
First Published:  17 July 2015 1:12 AM GMT
Next Story