Telugu Global
Others

జీహెచ్‌ఎంసీ కార్మికుల సమ్మె విరమణ

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) కార్మికులు సమ్మె విరమించారు. తాము సమ్మెను విరమించి శనివారం నుంచి విధుల్లో చేరుతున్నట్టు కార్మిక సంఘాల నాయకులు ప్రకటించారు. ఈ సందర్భంగా వీరు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావును కలిశారు. త్వరలోనే మున్సిపల్‌ కార్మికులకు గృహాలు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే ప్రభుత్వం ప్రకటించిన వేతన పెంపు 47 శాతం జీహెచ్‌ఎంసీ కార్మికులకు మాత్రమే వర్తిస్తుందని చెప్పడంతో హైదరాబాద్‌ మినహా మిగిలిన రాష్ట్రమంతా సమ్మె కొనసాగుతోంది. జీహెచ్‌ఎంసీ కార్మికులకు ఇచ్చినట్టుగానే […]

జీహెచ్‌ఎంసీ కార్మికుల సమ్మె విరమణ
X
గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) కార్మికులు సమ్మె విరమించారు. తాము సమ్మెను విరమించి శనివారం నుంచి విధుల్లో చేరుతున్నట్టు కార్మిక సంఘాల నాయకులు ప్రకటించారు. ఈ సందర్భంగా వీరు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావును కలిశారు. త్వరలోనే మున్సిపల్‌ కార్మికులకు గృహాలు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే ప్రభుత్వం ప్రకటించిన వేతన పెంపు 47 శాతం జీహెచ్‌ఎంసీ కార్మికులకు మాత్రమే వర్తిస్తుందని చెప్పడంతో హైదరాబాద్‌ మినహా మిగిలిన రాష్ట్రమంతా సమ్మె కొనసాగుతోంది. జీహెచ్‌ఎంసీ కార్మికులకు ఇచ్చినట్టుగానే తమకు కూడా వేతనాల పెంపు జరగాలని జిల్లాల్లోని మున్సిపల్‌ కార్మికులు డిమాండు చేస్తున్నారు. ఈ విషయాన్నే ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్ళినట్టు తెలిసింది. అయితే దీనిపై ఇంతవరకు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోలేదు.
కాగా శుక్రవారం ఉదయం నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో మున్సిపల్ కార్మికుల ఆందోళనలతో అట్టుడికింది. ఏపీలో తమ సమస్యల పరిష్కారం కోరుతూ విజయవాడలో ఉన్న ఏపీ సీఎం క్యాంప్ ఆఫీసు ముట్టడికి బయలు దేరిన మున్సిపల్ కార్మికులను, కార్మిక నేతలను బందర్ రోడ్డులో పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమ్మెకు మద్ధతుగా సీఐటీయూ, సీపీఎం చేపట్టిన ఈ ముట్టడి ఉద్రిక్తతకు దారి తీసింది. తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి సీఎం క్యాంపు ఆఫీసు ముట్టడికి పెద్ద ఎత్తున కార్మికులు బయలుదేరారు. అయితే రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన సీఐటీయూ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. పోలీసులకు, లెఫ్ట్‌ కార్యకర్తలకు జరిగిన తోపులాటలో మ‌హిళ‌ల‌తోస‌హా పలువురికి గాయాలయ్యాయి. దీంతో ఏపీలో సమ్మె మ‌రింత ఉద్రిక్త రూపం సంతరించుకుంది.
సమ్మెను విచ్చిన్నం చేయడానికి ఏపీ ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు సిద్ధమైంది. చెత్త తరలింపునకు చర్యలు చేపడుతోంది. ప్రభుత్వ యత్నాన్ని… పలుచోట్ల కార్మికులు అడ్డుకున్నారు. న్యాయమైన తమ డిమాండ్లను పరిష్కరించకుండా.. ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరించడం సరికాదని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు మున్సిపల్‌ కార్మికుల సమ్మెకు మద్ద‌తుగా వామపక్ష పార్టీలు సైతం ఆందోళన కొనసాగిస్తున్నాయి. సమ్మెపట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చిన ప్రభుత్వం.. ఇప్పుడు వాటిని నెరవేర్చాలని కోరితే.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. ప్రభుత్వం మొండివైఖరిని వీడకుండా…భవిష్యత్‌లో సమ్మెను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నారు. మున్సిపల్‌ కార్మికులు మాట్లాడుతూ ఈనెల 20 నుంచి సీఎం, మంత్రుల ఆఫీసు ఎదుట ధర్నాలు చేస్తామని, మంత్రులను 13 జిల్లాల్లో తిరగనివ్వమని హెచ్చరించారు. డిమాండ్లు తీర్చే వరకు ఉద్యమాన్ని ఉధృతంగా కొన‌సాగిస్తామ‌ని ఏపీ మున్సిపల్‌ కార్మిక జేఏసీ స్పష్టం చేసింది.
కాగా మున్సిపల్‌ కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా రెండు ప్రభుత్వాలు కంపు రాజకీయాలు చేస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్రస్థాయిలో విమర్శించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ పుష్కరాలు జరుగుతున్న ప్రాంతంలో కేబినెట్‌ సమావేశం ఎందుకు పెడుతున్నారో చంద్రబాబు చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రత్యేక హోదా కోసం త్వరలోనే ఎంపీల ఇళ్లను ముట్టడించనున్నట్లు రామకృష్ణ తెలిపారు.
First Published:  17 July 2015 11:02 AM GMT
Next Story