Telugu Global
Others

గంగిరెడ్డి సోదరుడు బ్రహ్మానందరెడ్డి అరెస్ట్‌

రెడ్ శాండిల్ వ్య‌వ‌హారంలో మోస్ట్‌ వాంటెడ్‌ స్మగ్లర్‌ గంగిరెడ్డి సోదరుడు బ్రహ్మానందరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైఎస్‌ హయాంలో బ్రహ్మానందరెడ్డి డీసీసీబీ చైర్మన్‌గా ఉన్నారు. ఆ సమయంలో భారీగా అక్రమాలకు పాల్పడ్డారని సీఐడీ పోలీసులు తేల్చారు. దాదాపుగా ఏడాదిన్నర  కాలంగా ఈ కేసును సీఐడీ పోలీసులు విచారణ జరుపుతున్నారు. బ్రహ్మానందరెడ్డి డీసీసీబీ చైర్మన్‌గా ఉన్నప్పుడు కడప జిల్లా వ్యాప్తంగా ఉన్న సొసైటీల్లో బినామీ రుణాలు తీసుకున్నారు. బ్రహ్మానందరెడ్డితో పాటు ఆయన అనుచరులు సైతం బినామీ రుణాలు, నకిలీ […]

రెడ్ శాండిల్ వ్య‌వ‌హారంలో మోస్ట్‌ వాంటెడ్‌ స్మగ్లర్‌ గంగిరెడ్డి సోదరుడు బ్రహ్మానందరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైఎస్‌ హయాంలో బ్రహ్మానందరెడ్డి డీసీసీబీ చైర్మన్‌గా ఉన్నారు. ఆ సమయంలో భారీగా అక్రమాలకు పాల్పడ్డారని సీఐడీ పోలీసులు తేల్చారు. దాదాపుగా ఏడాదిన్నర కాలంగా ఈ కేసును సీఐడీ పోలీసులు విచారణ జరుపుతున్నారు. బ్రహ్మానందరెడ్డి డీసీసీబీ చైర్మన్‌గా ఉన్నప్పుడు కడప జిల్లా వ్యాప్తంగా ఉన్న సొసైటీల్లో బినామీ రుణాలు తీసుకున్నారు. బ్రహ్మానందరెడ్డితో పాటు ఆయన అనుచరులు సైతం బినామీ రుణాలు, నకిలీ పాస్ పుస్తకాలతో దాదాపు రూ.కోటి వరకు అవకతవకలకు పాల్పడినట్లు సీఐడీ పోలీసులు విచారణలో తేల్చారు. పూర్తి విచారణ అనంతరం ఈరోజు బ్రహ్మానందరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
First Published:  16 July 2015 1:15 PM GMT
Next Story