Telugu Global
Others

చంద్ర‌బాబుపై కేసు పెట్టాల్సిందే

గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రిలో జరిగిన తొక్కిసలాటపై  వైఎస్ఆర్ కాంగ్రెస్ న్యాయ‌ప‌ర‌మైన చ‌ర్య‌ల‌కు ప్ర‌య‌త్నాల‌ను ప్రారంభించింది. ఈ ఘ‌ట‌న‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్లక్ష్యమే కారణమని, ఆయనపై 304 (ఎ) సెక్షన్ కింద కేసు నమోదు చేసేలా పోలీసులను ఆదేశించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్‌ లీగల్‌సెల్  మానవ హక్కుల కమిషన్ (హెచ్చార్సీ)కి  ఫిర్యాదు చేసింది. వైసీపీ విజ్ఞప్తిపై స్పందించిన హెచ్చార్సీ నాన్ జ్యుడీషియరీ సభ్యులు కాకుమాను పెదపేరిరెడ్డి ఈ నెల 27వ తేదీలోగా విచారణ నివేదికను […]

చంద్ర‌బాబుపై కేసు పెట్టాల్సిందే
X
గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రిలో జరిగిన తొక్కిసలాటపై వైఎస్ఆర్ కాంగ్రెస్ న్యాయ‌ప‌ర‌మైన చ‌ర్య‌ల‌కు ప్ర‌య‌త్నాల‌ను ప్రారంభించింది. ఈ ఘ‌ట‌న‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్లక్ష్యమే కారణమని, ఆయనపై 304 (ఎ) సెక్షన్ కింద కేసు నమోదు చేసేలా పోలీసులను ఆదేశించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్‌ లీగల్‌సెల్ మానవ హక్కుల కమిషన్ (హెచ్చార్సీ)కి ఫిర్యాదు చేసింది. వైసీపీ విజ్ఞప్తిపై స్పందించిన హెచ్చార్సీ నాన్ జ్యుడీషియరీ సభ్యులు కాకుమాను పెదపేరిరెడ్డి ఈ నెల 27వ తేదీలోగా విచారణ నివేదికను కమిషన్‌కు అందజేయాలని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్, రాజమండ్రి అర్బన్ ఎస్పీలను ఆదేశించారు. క్రౌడ్ మేనేజ్‌మెంట్‌పై నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ జారీ చేసిన మార్గదర్శకాలను ఏపీ ప్రభుత్వం తుంగలో తొక్కిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ లీగల్‌సెల్ అధ్యక్షుడు, న్యాయవాది పీ సుధాకర్‌రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. తొక్కిసలాటతో పవిత్ర గోదావరిలో పుష్కర స్నానం చేసేందుకు వచ్చిన భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. ఇందుకు కారణమైన ఏపీ సీఎంపై కేసులు నమోదు చేసేలా పోలీసులను ఆదేశించాలని ఆయన హక్కుల కమిషన్‌ను కోరారు.
First Published:  15 July 2015 11:12 PM GMT
Next Story