Telugu Global
Others

రంగారెడ్డి జిల్లాలో రేష‌న్ బియ్యం స్కాం బ‌ట్ట‌బ‌య‌లు

అనూహ్యంగా సైబ‌రాబాద్ పోలీసులు రేష‌న్ బియ్యం కుంభ‌కోణాన్ని ఛేదించారు. త‌మ‌కు అందిన స‌మాచారాన్ని ఆధారం చేసుకుని నెల రోజుల‌పాటు మాటు వేసి ఈ స్కాంను బ‌య‌ట‌పెట్టారు. దాదాపు 25 ట‌న్నుల బియ్యాన్ని ఈ సంద‌ర్భంగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సైబ‌రాబాద్ పోలీసు క‌మిష‌న‌ర్ సీవీ ఆనంద్ క‌థ‌నం ప్ర‌కారం… తెలంగాణ‌కు ప్ర‌తి నెలా 1.74 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల బియ్యం ప్ర‌భుత్వం కేటాయిస్తోంది. ఇందులో రంగారెడ్డి జిల్లాల‌కు 25,500 మెట్రిక్ ట‌న్నుల బియ్యం వ‌స్తున్నాయి. ఇవ‌న్నీ రేష‌న్ […]

రంగారెడ్డి జిల్లాలో రేష‌న్ బియ్యం స్కాం బ‌ట్ట‌బ‌య‌లు
X
అనూహ్యంగా సైబ‌రాబాద్ పోలీసులు రేష‌న్ బియ్యం కుంభ‌కోణాన్ని ఛేదించారు. త‌మ‌కు అందిన స‌మాచారాన్ని ఆధారం చేసుకుని నెల రోజుల‌పాటు మాటు వేసి ఈ స్కాంను బ‌య‌ట‌పెట్టారు. దాదాపు 25 ట‌న్నుల బియ్యాన్ని ఈ సంద‌ర్భంగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సైబ‌రాబాద్ పోలీసు క‌మిష‌న‌ర్ సీవీ ఆనంద్ క‌థ‌నం ప్ర‌కారం… తెలంగాణ‌కు ప్ర‌తి నెలా 1.74 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల బియ్యం ప్ర‌భుత్వం కేటాయిస్తోంది. ఇందులో రంగారెడ్డి జిల్లాల‌కు 25,500 మెట్రిక్ ట‌న్నుల బియ్యం వ‌స్తున్నాయి. ఇవ‌న్నీ రేష‌న్ డీల‌ర్ల ద్వారా ప్ర‌జ‌ల‌కు పంపిణీ కావాలి. కాని ఇందులో దాదాపు 25 నుంచి 40 శాతం వ‌ర‌కు ప్ర‌తినెలా అక్ర‌మ మార్గంలో త‌ర‌లిపోతున్నాయి. అంటే ఆరు వేల నుంచి 10 వేల ట‌న్నుల వ‌ర‌కు అస‌లైన ల‌బ్దిదారులకు ఇవి అంద‌డం లేదు. ఇలా నెల‌నెలా త‌ర‌లిపోతున్న బియ్యం విలువ దాదాపు 15 కోట్లు ఉంటుంద‌ని ఆయ‌న తెలిపారు. ఇలా రేష‌న్ డీల‌ర్లు, మిల్ల‌ర్లు కుమ్మ‌క్కై ఈ కుంభ‌కోణాన్ని నిర్విఘ్నంగా నిర్వ‌హిస్తున్నార‌ని, వివిధ రేష‌న్ డీల‌ర్ల నుంచి మిల్ల‌ర్లు ఈ బియ్యాన్ని కిలో 10 నుంచి 16 రూపాయ‌ల మ‌ధ్య‌లో కొనుగోలు చేసి మ‌ళ్ళీ ప్ర‌భుత్వానికే వీటిని 20 నుంచి 26 రూపాయ‌ల మ‌ధ్యలో అమ్ముతున్నార‌ని ఆయ‌న చెప్పారు. దీంతోపాటు కిరోసిన్ కూడా ఇలాగే అక్ర‌మ మార్గంలో త‌ర‌లిపోతోంద‌ని ఆనంద్ చెప్పారు. త‌మ‌కు అందిన స‌మాచారం ఆధారంగా నెల రోజుల‌పాటు నిఘా వేసి ఈ రాకెట్ గుట్టును ర‌ట్టు చేశామ‌ని క‌మిష‌న‌ర్ చెప్పారు. ఈ కేసుకు సంబందించి 35 మందిని అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు.
First Published:  16 July 2015 5:13 AM GMT
Next Story