Telugu Global
Family

జర నవ్వండి ప్లీజ్ 145

స్పీడ్‌ ఒక వ్యాపారవేత్త భార్యను తీసుకుని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు బయల్దేరాడు. ట్రాఫిక్‌ జాం తప్పించుకుని మొత్తానికి రెండు గంటల్లో ఎయిర్‌పోర్టు చేరాడు. అతని భార్య ఢిల్లీ వెళ్తోంది. ఆమెకు వీడ్కోలు చెప్పి బయల్దేరి బేగంపేటలో ట్రాఫిక్‌జాంలో ఇరుక్కున్నాడు. ఇంటికి చేరి చెమట తుడుచుకుని తాళం తీయబోయేంతలో తలుపుకు పెట్టిన టెలిగ్రాం చూశాడు. అది ఢిల్లీ చేరిన భార్య ఇచ్చిన టెలిగ్రాం. “అరైవ్డ్‌ సేఫ్‌ – లలిత”. ——————————————————————— అతని వల్లే…. లెక్చరర్‌: క్లాసుకు ఎందుకు ఆలస్యంగా వచ్చావు? […]

స్పీడ్‌
ఒక వ్యాపారవేత్త భార్యను తీసుకుని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు బయల్దేరాడు. ట్రాఫిక్‌ జాం తప్పించుకుని మొత్తానికి రెండు గంటల్లో ఎయిర్‌పోర్టు చేరాడు. అతని భార్య ఢిల్లీ వెళ్తోంది. ఆమెకు వీడ్కోలు చెప్పి బయల్దేరి బేగంపేటలో ట్రాఫిక్‌జాంలో ఇరుక్కున్నాడు. ఇంటికి చేరి చెమట తుడుచుకుని తాళం తీయబోయేంతలో తలుపుకు పెట్టిన టెలిగ్రాం చూశాడు. అది ఢిల్లీ చేరిన భార్య ఇచ్చిన టెలిగ్రాం. “అరైవ్డ్‌ సేఫ్‌ – లలిత”.
———————————————————————
అతని వల్లే….
లెక్చరర్‌: క్లాసుకు ఎందుకు ఆలస్యంగా వచ్చావు?
రాధ: ఒకబ్బాయి నన్ను ఫాలో అవుతున్నాడు సార్‌!
లెక్చరర్‌: అందుకని ఆలస్యమయిందా?
రాధ: అతను మెల్లగా నడుస్తున్నాడు సార్‌!
———————————————————————
మంచి భర్త
తండ్రి తన పిల్లల్ని పిలిచి
“గతవారం అమ్మ చెప్పినట్లు విని ఎదిరించకుండా అన్ని పనులు చేసిన ఒకరికి ఈ వంద రూపాయలు బహుమతి ఇస్తాను. ఎవరికివ్వాలి?” అన్నాడు.
పిల్లలు “నీకే డాడీ!” అన్నాడు.
———————————————————————
ఫైట్‌
“హలో! పోలీస్‌! మా పక్కింటతను, మా నాన్న పోట్లాడుకుంటున్నారు, అరగంటనించీ. మా నాన్నను పక్కింటతను కొడుతున్నాడు.”
“మరి అరగంటకు ముందే ఫోన్‌ చెయ్యొచ్చు కదా!”
“అప్పుడు మా నాన్న పక్కింటతన్ని కొడుతున్నాడు.”

First Published:  15 July 2015 1:03 PM GMT
Next Story