Telugu Global
Others

పట్టపగలు రోడ్డు మీదే గ్యాంగ్ వార్!

గుర్గావ్‌లోని ఎంజి రోడ్డు సమీపంలోని సెంట్రల్‌ మాల్‌ వద్ద కొందరు సాయుధ దుండగులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందినట్లు పోలీసులు ప్రకటించారు. గుర్గావ్‌ ఏసిపి ఇచ్చిన సమాచారం మేరకు ఒక హత్య కేసులో నింధితుడుగా ఉన్న వ్యక్తిని హతమార్చేందుకు కొంతమంది సాయుద దుండగులు పథకం ప్రకారం దాడి చేశారు. ఆ దాడి నుంచి అతను తప్పించుకోగా దీనితో ఎలాంటి సంబంధం లేని ఆటో డ్రైవర్‌ ఒకరు మృతి చెందారు. అగంతకుల కాల్పులు నుంచి తప్పించుకోవడానికి దాడికి […]

గుర్గావ్‌లోని ఎంజి రోడ్డు సమీపంలోని సెంట్రల్‌ మాల్‌ వద్ద కొందరు సాయుధ దుండగులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందినట్లు పోలీసులు ప్రకటించారు. గుర్గావ్‌ ఏసిపి ఇచ్చిన సమాచారం మేరకు ఒక హత్య కేసులో నింధితుడుగా ఉన్న వ్యక్తిని హతమార్చేందుకు కొంతమంది సాయుద దుండగులు పథకం ప్రకారం దాడి చేశారు. ఆ దాడి నుంచి అతను తప్పించుకోగా దీనితో ఎలాంటి సంబంధం లేని ఆటో డ్రైవర్‌ ఒకరు మృతి చెందారు. అగంతకుల కాల్పులు నుంచి తప్పించుకోవడానికి దాడికి గురైన కారును చాలా వేగంగా డ్రైవర్‌ పోనిచ్చాడు. ఆ తొందరలో ముందున్న ఆటోని ఢకొట్టడంతో ఆటో డ్రైవర్‌ అక్కడిక్కడే చనిపోయాడు. ఈ క్రమంలోనే ఒక కారు పూర్తిగా పల్టీ కొట్టింది. సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటన చూసి స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. దుండగులు మాత్రం తప్పించుకు పారిపోయారు. అగంతకులు ఉత్తరప్రదేశ్‌ రిజిస్ట్రేషన్‌ ఉన్న కారులో వచ్చినట్లు పోలీసులు చెప్పారు.
First Published:  15 July 2015 1:07 PM GMT
Next Story